ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే: ఎస్‌బీఐకి సుప్రీం ఆదేశం

Published : Mar 11, 2024, 02:09 PM ISTUpdated : Mar 11, 2024, 02:11 PM IST
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే: ఎస్‌బీఐకి సుప్రీం ఆదేశం

సారాంశం

రాజకీయపార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి సమాచారాన్ని నిర్ణీత గడవులోపుగా ఈసీకి అందించాలని  సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించింది.

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందించేందుకు మరింత సమయం కావాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.  ఈ నెల  12వ తేదీ పనివేళల్లోపుగా  ఈ వివరాలను  అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది  సుప్రీంకోర్టు. మరోవైపు  ఈ నెల 15 సాయంత్రంలోపుగా ఈ సమాచారాన్ని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. గడువులోపుగా  తమ ఆదేశాలను పాటించకుంటే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐ చైర్మెన్ , ఎండీ, డైరెక్టర్లను కోర్టు హెచ్చరించింది.

also read:చంద్రబాబు నివాసానికి బీజేపీ,జనసేన నేతలు: సీట్ల సర్ధుబాటుపై కీలక చర్చలు

ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్దమని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం  ఈ ఏడాది ఫిబ్రవరి  15న తీర్పును వెల్లడించింది.రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి వారి వివరాలు, విరాళాలు తీసుకున్నవారి సమాచారాన్ని ఈ నెల  13 లోపుగా వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ వివరాలను వెల్లడించేందుకు ఈ ఏడాది జూన్ వరకు  గడువును పెంచాలని  ఎస్ బీ ఐ గత వారం ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. 

also read:నిడదవోలు నుండి జనసేన పోటీ: కందుల దుర్గేష్‌ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

సీజేఐ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీ.ఆర్. గవాయ్, జే.బీ. పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది.గత 26 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది.  ఈ విషయమై ఎందుకు మౌనంగా ఉన్నారని కూడ  సుప్రీంకోర్టు ప్రశ్నించింది.వేర్వేరు బ్యాంకు శాఖల్లోని సమాచారాన్ని  సేకరించి సరిపోల్చుకొనేందుకు సమయం ఇవ్వాలని ఎస్‌బీఐ తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు.

PREV
click me!

Recommended Stories

ఇండోనేషియా పార్లమెంట్ లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Modi Indonesia Tour
ఇండోనేషియాలో అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ | PM Modi Indonesia Visit | Bintang Adipurna Honour