National Highway Projects - PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హర్యానాలోని గురుగ్రామ్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. గురుగ్రామ్ నుంచి సోమవారం (మార్చి 11) మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారని పీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ రహదారి-48పై ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్‌ను మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి సహాయపడే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
అంతకుముందు, ఎక్స్ లో పీఎం మోడీ భారతదేశం అంతటా కనెక్టివిటీకి నేడు చాలా ముఖ్యమైన రోజు అనీ, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 112 జాతీయ రహదారులను జాతికి అంకితం చేయడం లేదా వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రారంభించడంతో పాటు ఈ మొత్తం ప్రాజెక్టులు ఆర్థిక వృద్ధిని పెంచుతాయి. తదుపరి తరం మౌలిక సదుపాయాలను నిర్మించడానికి తమ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొన్నారు.
Today is an important day for connectivity across India. At around 12 noon today, 112 National Highways, spread across different states, will be dedicated to the nation or their foundation stones would be laid. The Haryana Section of Dwarka Expressway will be inaugurated. These… pic.twitter.com/7uS1ETc8lj
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే..
ఎనిమిది లేన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 19 కిలోమీటర్లు. దీని హర్యానా సెక్షన్‌ను నిర్మించడానికి దాదాపు రూ. 4,100 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి రైల్-ఓవర్-బ్రిడ్జ్ (ROB) వరకు 10.2 కిలోమీటర్ల పొడవు, బసాయ్ ROB 8.7 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఇందులో ఒకటి ఖేర్కి దౌలా నుండి ఖేర్కి దౌలా వరకు కనేక్టివిటీ ఉండగా, ఇది ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం, గురుగ్రామ్ బైపాస్‌కు నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది.
ప్రధాని మోడీ ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే..
ప్రధాని మోడీ ప్రారంభించనున్న ఇతర ప్రాజెక్టులలో నాంగ్లోయ్-నజఫ్‌గఢ్ రోడ్ నుండి ఢిల్లీలోని సెక్టార్ 24 ద్వారక సెక్షన్ వరకు 9.6 కి.మీ పొడవైన ఆరు లేన్ల రహదారి కూడా ఉంది. వీటిని ఉత్తరప్రదేశ్‌లో సుమారు రూ.4,600 కోట్లతో లక్నో రింగ్‌రోడ్డు అభివృద్ధి చేయబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి సెక్షన్‌లోని ఎన్‌హెచ్-16లో సుమారు రూ.2,950 కోట్లతో అభివృద్ధి చేయబడింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లో సుమారు రూ. 3,400 కోట్లతో ఎన్‌హెచ్-21 కిరాత్‌పూర్-నేర్‌చౌక్ సెక్షన్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కర్ణాటకలోని దోబాస్‌పేట్-హెస్కోట్ సెక్షన్‌ను రూ.2,750 కోట్లు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రూ.20,500 కోట్ల విలువైన 42 ప్రాజెక్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న ప్రధాన ప్రాజెక్టులలో ఆంధ్రాలోని బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రూ.14,000 కోట్ల విలువైన 14 ప్యాకేజీలు ఉన్నాయి. కర్ణాటకలోని NH-748Aలోని బెల్గాం-హుంగుండ్-రాయచూర్ సెక్షన్‌లోని ఆరు ప్యాకేజీలు రూ.8,000 కోట్లతో అభివృద్ది చేశారు. ఇందులో హర్యానాలో రూ.4,900 కోట్ల విలువైన షామ్లీ-అంబాలా హైవే మూడు ప్యాకేజీలు, పంజాబ్‌లో రూ.3,800 కోట్ల విలువైన అమృత్‌సర్-భటిండా కారిడార్ రెండు ప్యాకేజీలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధికి గణనీయంగా దోహదపడతాయనీ, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంలో, దేశవ్యాప్తంగా ప్రాంతాలలో వ్యాపారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడతాయని ప్రధాని పేర్కొన్నారు.