booster dose: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం అధికంగా నమోదవుతుండంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే, బూస్టర్ డోసులను సైతం వచ్చే జనవరి నుంచి అందిస్తామని తెలిపింది.
booster dose: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. సాధారణ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ సైతం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నిత్యం ఈ కేసులు పదుల సంఖ్యలో నమోదుకాడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వైరస్ కట్డడికి ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్పీడ్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, కరోనా కట్టడి కోసం మెరుగైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ఆంక్షలు సైతం విధించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ప్రారంభం నుంచి దేశ ప్రజలకు కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే బూస్టర్ డోసులను అందిస్తామని ప్రకటించారు. ముందుకు పెద్దలకు బూస్టర్ డోసులు అందిస్తామని తెలిపారు.
Also Read: Manikka Vinayagam: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం మృతి
undefined
కరోనా వైరస్ బూస్టర్ డోసులు 60 సంవత్సరాలు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ముందస్తుగా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఆ వ్యాధులపై స్పష్టత ఇచ్చేందుకు మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. ఇందులో 60 ఏండ్లు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మొదట అందిస్తామని తెలిపింది. మొత్తం 20 రకాల వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులుగా పరిగణించింది. హృద్రోగ సంబంధిత, మధుమేహం, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సంబంధిత, క్యాన్సర్, సికిల్ సెల్, స్టెరాయిడ్ లేదా ఇమ్యునో సప్రెస్సార్ల మందులు ఎక్కువ కాలం వాడాల్సి రావడం, కండరాల బలహీనత, యాసిడ్ దాడికి గురైన వారు, మల్టిపుల్ డిజేబులిటీలు, వినికిడి సమస్యలు, అంధత్వం, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు వంటి అనారోగ్య సమస్యలను ఈ జాబితాలో పేర్కొంది. ఇక బూస్టర్ డోసు తీసుకునే వీరిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు మెడికల్ ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుందని పేర్కొంది.
Also Read: Bandi Sanjay: కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమిది.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం జాతినుద్దేశించి మాట్లాడుతూ.. 12-18 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. అలాగే ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్ వారియర్స్‌కు అదనంగా మరో డోసు వ్యాక్సిన్ (బూస్టర్) అందిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించారు. అయితే పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో ఆదివారం క్లారిటీ వచ్చింది. పిల్లలకు కోవాగ్జిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను మూడు రకాల వయస్సు పిల్లలపై ప్రయోగించారు. 12 -18 ఏళ్లు, 6-12 ఏళ్లు, 2-6 ఏళ్ల మధ్య పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. తొలుత 12-18 ఏళ్ల పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను పరిశీలించారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో చిన్నారులపై కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశారు. ఈ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ డీసీజీఐకి పంపింది. సుమారు 525 మంది చిన్నారులపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ కోవాగ్జిన్‌నే ఇవ్వనున్నారు. అయితే, పిల్లలకు కోవిడ్ - 19 వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ‘అశాస్త్రీయత’ నిర్ణయం నిరాశపర్చిందని ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కె రాయ్ అన్నారు.
Also Read: మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై బిగుస్తున్న ఉచ్చు.. ఈ వారంలోనే ఛార్జిషీట్ దాఖలు !