money laundering case: మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ పై చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. ఈ వారమే ఆయనపై ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేయనుందని సమాచారం.
money laundering case: మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మనీ లాండరింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అనిల్ దేశ్ ముఖ్ పై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. ఈ వారమే ఆయనపై ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. రూ.100 కోట్ల దోపిడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో ఈ వారం ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. దీంతో ఈ కేసులో ఇది రెండో ఛార్జీషీట్ కానుంది. జూన్ లో అనిల్ దేశ్ ముఖ్ నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ఆయన వ్యక్తిగత సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు ఆయనకు సమన్లు కూడా జారీ అయ్యాయి. మనీలాండరింగ్ కేసులో ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు నవంబర్ 2న ఆయనను అరెస్టు చేశారు. ఇటీవలే దేశ్‌ముఖ్ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు కూడా చేసింది.
Also Read: Libya: సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 27 మృతదేహాలు..
undefined
ఈ కేసులో అనిల్ దేశ్ ముఖ్ నవంబర్ 2న ఈడీ అరెస్టు చేయగా, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పాలండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండేలను జూన్ నెలలో అదుపులోకి తీసుకుంది. పలాండే, షిండేలపై ఆగస్టు 24న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు గతంలో సంచలనం కాగా, రాజకీయ ప్రకంపనలు సృష్టిచాయి. దీంతో అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సీబీఐ పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగ్ అక్రమాల కోణంపైనా దర్యాప్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ ను నమోదుచేసింది.
Also Read: నకిలీ అధికారుల డ్రగ్ కేసు బెదిరింపులు.. భయంతో యువ నటి ఆత్మహత్య
దీనిని ఆధారంగా చేసుకుని Enforcement Directorate.. అనిల్ దేశ్‌ముఖ్‌పై అక్రమ నగదు చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆయన కార్యాలయాలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. మంత్రిగా ఉన్న సమయంలో దేశ్‌ముఖ్‌కు రూ.4 కోట్లు ఇచ్చామని కొందరు బార్ యజమానులు అంగీకరించినట్లు సమాచారం. వీరి వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేసినట్లు తెలిసింది. అలాగే, ED అధికారులు దాదాపు 12 మంది SP స్థాయి అధికారుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇందులో IPS మరియు రాష్ట్ర పోలీసు సర్వీస్ అధికారులు ఉన్నారు. దేశ్‌ముఖ్ సూచన మేరకే ఈ అధికారుల బదిలీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. డీసీపీ ట్రాఫిక్ పూణె రాహుల్ శ్రీరామ్, ఎస్పీ జి. శ్రీధర్ లు వాంగ్మూలాలు నమోదు చేసిన అధికారులలో ఉన్నట్టు తెలిసింది. ఈ కేసులో మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
Also Read: Taliban: 72 కిలో మీటర్లు మహిళలు వెళ్తే.. తాలిబన్ల మరో హుకుం !