హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంతో దూసుకొచ్చిన ట్రక్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు.
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంతో దూసుకొచ్చిన ట్రక్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు. హర్యానాలోని (Haryana) జజ్జర్ జిల్లాలోని బహదుర్‌ఘర్ సమీపంలో కుండ్లీ మనేస్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మనేస్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వేపై బద్లి మరియు ఫరూఖ్ నగర్ మధ్య మనేస్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. బాధితులు.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని నాగ్లా అనూప్ గ్రామానికి చెందినవారు. వీరు రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలోని గోగమేడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. వీరు మొత్తం 11 మంది కారులో ఉన్నారు.
అయితే మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్ వెనకాల డ్రైవర్ కారును పార్క్ చేశాడు. అయితే వెనకాల నుంచి వచ్చిన మరో ట్రక్ వారి కారును ఢీకొట్టింది. దీంతో కారు రెండు ట్రక్‌ల మధ్య నలిగిపోయింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. కారు డ్రైవర్, ఓ మహిళ, ఓ చిన్నారి ప్రమాదం జరిగిన సమయంలో కారులో లేకపోవడంతో.. వారు ప్రాణాలతో బయటపడ్డారు.
undefined
Also read: 39 మంది మహిళా ఆర్మీ ఆఫీసర్లకు శాశ్వత కమిషన్.. సుప్రీం కోర్టులో ఫలించిన పోరాటం..
పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాలను బహదుర్‌ఘర్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.