64 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. 19వ ఫ్లోర్ నుంచి దూకేసిన వ్యక్తి

By telugu teamFirst Published Oct 22, 2021, 2:17 PM IST
Highlights

ముంబయిలోని 64 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 19వ అంతస్తుల ఈ రోజు మధ్యాహ్న ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సుమారు 14 ఫైర్ ఇంజిన్లు, ఇతర సహాయక సిబ్బంది స్పాట్‌కు చేరుకుంది. మంటలకు భయపడి ఓ వ్యక్తి 19వ ఫ్లోర్ నుంచి దూకేశాడు. ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
 

ముంబయి: Maharastra రాజధాని Mumbaiలో 64 అంతస్తుల లగ్జరీ Buildingలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 19వ ఫ్లోర్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. Fire నుంచి తనను రక్షించుకోవడానికి 19వ అంతస్తులోని ఓ వ్యక్తి తీవ్ర ప్రయత్నం చేశాడు. బాల్కనీ గ్రిల్స్ పట్టుకుని కొంతసేపు వేలాడినట్టు తెలిసింది. అనంతరం మంటలకు భయపడి దూకేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆయనను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్టు వైద్యులు తెలిపారు. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది, సహాయక చర్య సిబ్బంది స్పాట్‌కు చేరారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.

లాల్‌బాగ్ ఏరియాలో కర్రీ రోడ్ దగ్గర అవిగ్నా పార్క్ సొసైటీలోని 64 అంతస్తుల భవనంలో 19వ అంతస్తులో మంటలు రేగాయి. ఈ విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరారు. సుమారు 14 ఫైర్ ఇంజిన్లు ఇంకా మంటలను అదుపుతెచ్చే పనిలో ఉన్నాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

ఫైర్ అండ్ రెస్క్యూ శాఖ సిబ్బందికి సమాచారం అందగానే వెంటనే స్పాట్‌కు చేరుకున్నారని ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ తెలిపారు. చాలా మందిని ఇప్పటికే రక్షించారని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, మంటలకు భయపడి ఓ వ్యక్తి 19వ అంతస్తు నుంచి దూకేసినట్టు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది సమర్థంగా పనిచేస్తున్నదని, వదంతలు వ్యాపించవద్దని సూచించారు.

Also Read: కృష్ణా జిల్లా: నూజివీడులో గ్యాస్ పైప్‌లైన్ లీక్.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

ఆ వ్యక్తి 19వ అంతస్తు నుంచి పట్టు తప్పిపడిపోయాడని ఇంకొందరు చెబుతున్నారు. కిందపడి మరణించిన వ్యక్తిని అరుణ్ తివారీగా గుర్తించారు. ఆయనను 12.45 గంటల ప్రాంతంలో హాస్పిటల్‌కు తీసుకువచ్చినట్టు కేఈఎం హాస్పిటల్ అధికారి ఒకరు వివరించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలిపారు.

ప్రస్తుతం ఫైర్ బ్రిగేడ్ అధికారులు 19వ అంతస్తు దాటి కూడా పైనకు వెళ్లగలిగారని, ఆ అంతస్తుల్లో చిక్కుకున్న ఇతరులను సురక్షితంగా కాపాడగలిగారని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బల్ చాహల్ వివరించారు. మంటలకు కారణాలు ఇంకా తెలియరాలేదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

click me!