డీకే శివకుమార్ కుమార్తెకు షాక్: మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు

By Nagaraju penumalaFirst Published Sep 10, 2019, 7:39 PM IST
Highlights

డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. శివకుమార్ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఐశ్వర్యను విచారించాలని ఈడీ నిర్ణయించింది.

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. మనీలాండరింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయనకు మరో షాక్ ఇచ్చింది ఈడీ. ట్రబుల్ షూటర్ కుమార్తెను సైతం వెంటాడుతోంది. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. 

ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. శివకుమార్ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఐశ్వర్యను విచారించాలని ఈడీ నిర్ణయించింది. ఇకపోతే ఐశ్వర్య నిర్వహిస్తోన్న ట్రస్ట్ కు సంబంధించిన పత్రాలు సైతం ఈడీకి అందడంతో ట్రస్ట్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరాతీయనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను రెండు రోజులపాటు విచారించిన ఈడీ అధికారులు ఈనెల 3న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఢిల్లీ కోర్టు డీకే శివకుమార్ ను పదిరోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. 

నోట్ల రద్దు సమయంలో ఈడీ, ఐటీ శాఖలు డీకేఎస్ ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో 2017 ఆగష్టు 2న ఢిల్లీలోని శివకుమార్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.8.59 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని పలు కేసులు నమోదు చేశారు. ఈ దాడులు అప్పట్లో  సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  

ఈ వార్తలు కూడా చదవండి

మనీల్యాండరింగ్ కేసులో డీకే‌కు 10 రోజుల కస్టడీ

నా అరెస్ట్‌తో బీజేపీ మిషన్ పూర్తయ్యింది... బాధితుడిగా మిగిలా: డీకే శివకుమార్

కాంగ్రెస్‌కు షాక్: మనీల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్ 

click me!