కాంగ్రెస్ పార్టీకి స్టార్ హీరోయిన్ గుడ్ బై

By Nagaraju penumalaFirst Published Sep 10, 2019, 4:50 PM IST
Highlights

సమున్నత లక్ష్యం కోసం కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఊర్మిళ ప్రకటించారు. 

ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. స్టార్ హీరోయిన్ ఊర్మిల మతోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఆరు నెలల్లోనే రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. 

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో ఊర్మిళ మతోండ్కర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముంబై నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 

ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె పార్టీ వీడతారంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. అయితే మంగళవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

సమున్నత లక్ష్యం కోసం కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఊర్మిళ ప్రకటించారు. 

ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ పార్టీ పరంగా పోరాటం చేశానని ఆత్మసాక్షిగా, ఎంతో గౌరవంతో ఈ ఎన్నికల్లో శ్రమించానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తాను ఎంతో నేర్చుకున్నానని స్పష్టం చేశారు. అయితే రాజకీయాలు వదిలి తాను ఎక్కడికీ వెళ్లనని ఊర్మిళ చెప్పుకొచ్చారు.  

click me!