భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు నేలమట్టం.. శిథిలాల్లో చిక్కుకున్న నలుగురు

Published : Nov 23, 2021, 02:37 PM IST
భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు నేలమట్టం.. శిథిలాల్లో చిక్కుకున్న నలుగురు

సారాంశం

తమిళనాడులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వర్షాల ధాటికి సేలం జిల్లాలో నాలుగు ఇళ్లు నేలకూలాయి. ఈ శిథిలాల కిందే నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 13 మందిని ఈ శిథిలాల నుంచి రక్షించి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వర్షాలు తమిళనాడు రాష్ట్రంలో 61శాతం అధికంగా కురిశాయి.  

చెన్నై: Tamil Naduను వర్షాలు(Rains) ముంచెత్తుతున్నాయి. Chennai పరిసరాల్లో రోడ్లు నదులను తలపించాయి. కార్లు, ఇతర వాహనాలు నీట కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి చిన్న చిన్న పడవలను ఉపయోగించాల్సి వచ్చింది. కాగా, మంగళవారం ఉదయం సేలం జిల్లాలో వర్షాల దాటికి నాలుగు నివాసాలు నేలమట్టం(Houses Collapse) అయ్యాయి. ఈ శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. శిథిలాలను తొలగించే పనిలో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఉన్నది. ఇప్పటి వరకు 13 మందిని రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వివరించారు. 

తమిళనాడు సేలం జిల్లాలోని కరుంగల్పట్టిలో భీకర వర్షానికి నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. ఈ శిథిలాల కిందే నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 13 మందిని రక్షించి సేలం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తూ శిథిలాలను ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది తొలగించే పనిలో ఉన్నదని వివరించారు.

Also Read: Heavy Rains : 24 గంటల్లో ముంచుకురాబోతున్న మరో అల్పపీడనం.. ఏపీలోని ఆ సరిహద్దు గ్రామాలకు అలర్ట్....

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, నెల్లూరులో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకలోనూ వర్షాలు భీకరంగా పడుతున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, మంగళవారం కూడా తమిళనాడులోని తిరునేల్వేలి, తూతుక్కుడి, మదురై, రామనాథపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అంతేకాదు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వర్షాలు తమిళనాడులో అధికంగా కురిశాయి. 61శాతం అధికంగా వర్షాలను తమిళనాడు రాష్ట్రం చవిచూసింది. పుదుచ్చేరిలోనూ గతంలో లేనంత భారీగా వర్షాలు కురిశాయి. సుమారు ఏడు వేల హెక్టార్ల పంట భూములు, ఇతర సాగు ప్రాంతాలపై ఈ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని వేశాయి. ఈ ఏడాది వర్షాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో అధికంగా వానలు కురిశాయి.

Also Read: Heavy Rains : జగన్ సమీక్ష.. ఆ కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం.. వారికి వెంటనే కొత్త ఇల్లు...

రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని Department of Meteorology ప్రకటించింది. దీని ప్రభావం శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తుంది బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి Heavy rains పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అయితే తమిళనాడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కాగా, చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను వర్షాలు వదలడంలేదు, వరదలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల భారీగా పంట నష్టం జరగగా,  ఇప్పటికే పలు గ్రామాలు Flood ముంపులోనే ఉన్నాయి. దీంతో చాలా మంది పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. మరోవైపు పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్ కుంగిపోయాయి. అయితే తాజాగా సోమవారం చిత్తూరు జిల్లాలోని దాదాపు 100 
Villages ప్రమాదపు అంచుకు చేరుకున్నాయి.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu