కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలపై తీసుకున్న యూటర్న్ ప్రతిపక్షాలు మళ్లీ ఐక్యం కావడానికి మంచి అవకాశాన్ని ఇస్తున్నట్టు విశ్లేషనలు వస్తున్నాయి. దేశంలో విపక్షం బలహీనపడటానికి ప్రధాన కారణం వాటి మధ్య లోపించిన ఐక్యతే కారణమని చెబుతున్నారు. అయితే, సాగు చట్టాలను రద్దు ప్రకటనపైనా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఒక్క ఐక్య ప్రకటనా కూడా ఇవ్వకపోవడం వాటి మధ్య నెలకొన్న స్తబ్దతను స్పష్టం చేస్తున్నట్టు వివరిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఏడాదిపాటు Delhiసరిహద్దుల్లో Farmers చేస్తున్న ధర్నాకు.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. Farm Lawsను ఈ నెలలో ప్రారంభం కాబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో Repeal చేస్తామని స్వయంగా ప్రధాన మంత్రి Narendra Modi ప్రకటించారు. రైతులకు క్షమాపణలు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద యూటర్న్ ఇది. దీన్ని Opposition ఒక అస్త్రంగా ఉపయోగించగలవా? ఆ సామర్థ్యం ప్రతిపక్షాలకు ఉన్నదా? అసలు ఈ నిర్ణయం విపక్షాలకు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? ఓ సారి పరిశీలిద్దాం.
బీజేపీని ఢీకొట్టడంలో ప్రతిపక్షాలు విఫలం కావడానికి ప్రధానంగా ఉన్న లోపం అనైక్యత. విపక్షాలు వాటి మధ్య అవే రకరకాల సంఘర్షణలతో వేరు వేరుగా ఉంటున్నాయి. ఏకతాటి మీదకు వచ్చి ఐక్యంగా ఎన్నికల్లో కొట్లాడటానికి సిద్ధమైతే పరిస్థితులు వేరుగా ఉంటాయనే వాదనలున్నాయి. ప్రభుత్వ తప్పిదాలనూ ఐక్యంగా ప్రతిఘటించకుండా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. తాజా పరిణామంలోనూ ప్రతిపక్షాల అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సాగు చట్టాలపై కేంద్రం యూటర్న్‌ను విపక్షాలు ఒక ఆయుధంగా వినియోగించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకైతే అవి సంయుక్తంగా ఒక్క ప్రకటనా చేసిన దాఖలా లేదు.
undefined
Also Read: Farm Laws: పంజాబ్, యూపీలో బీజేపీకి లైన్ క్లియర్!.. విపక్షాలకు నష్టమే?.. ‘మోడీ తరహా నిర్ణయం కాదిదీ’
ప్రతిపక్షాల అనైక్యత గత నెలలోనూ స్పష్టంగా కనిపించింది. లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లి రైతులు మరణించిన ఘటనలోనూ ఇదే స్పష్టమైంది. ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ వేగంగా స్పందించి అక్కడికి చేరుకున్నారు. ఇతర విపక్ష పార్టీలు త్వరగా ప్రతిస్పందించాయి. కానీ, ఆ ప్రతిపక్షాలు చేతులు కలుపలేదు. వేటికవే వేర్వేరుగా ర్యాలీలు తీశాయి. ప్రతిపక్షాల్లో ఉన్న ఇలాంటి ధోరణే కేంద్రంలో బీజేపీ నిరాటంకంగా కొనసాగడానికి దోహదపడుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, సాగు చట్టాల రద్దు ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావడానికి సదవకాశాన్ని ఇస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు ఐక్యమైతేనే సాగు చట్టాల రద్దు నిర్ణయం వాటికి సమర్థమైన ఆయుధంగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు.
లఖింపూర్ ఖేరి ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఓ రైతు బల్జీత్ సింగ్ మాట్లాడుతూ తాను 2019లో బీజేపీకే ఓటేశారని చెప్పారు. కానీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సాగు చట్టాలు వెనక్కి తీసుకున్నా తన నిర్ణయంలో మార్పు లేదని అన్నారు. అయితే, ప్రతిపక్షాల్లో ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఆయనకు స్పష్టత లేదు. అన్ని ప్రతిపక్షాలను పరిశీలిస్తున్నారని ఏ పార్టీకి వేయాలో తర్వాత నిర్ణయించుకుంటానని ఆయన అన్నారు.
Also Read: Farm Laws: ఆందోళనలు ఆగవు.. చట్టాల రద్దు సరే.. మద్దతు ధరపైనా మాతో చర్చించాలి: రైతులు
ఇదిలా ఉండగా, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అపూర్వ విజయం సాధించిన టీఎంసీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలపైనా కన్నేసింది. త్రిపురతోపాటు గోవా ఎన్నికల్లోనూ అడుగులు వేస్తున్నది. గోవాలో పోటీ చేయడం కాంగ్రెస్‌కు కలవరం తెప్పిస్తున్నది. గత నెలలోనే కాంగ్రెస్‌పై టీఎంసీ విరుచుకుపడింది. ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకుండా కాంగ్రెస్ తప్పిదం చేసిందని మండిపడింది.
సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కలిసి సక్రమంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, దేనికదే అన్నట్టుగా పార్టీలు ఉండి కేవలం అధికార పార్టీని విమర్శిస్తూ పోతే ఆశించిన ఫలితాలు రావని కార్నిజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషన్ పీస్‌లో సౌత్ ఏషియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మిలాన్ వైష్ణవ్ అన్నారు. అన్ని పార్టీలు కలిసి సానుకూలమైన ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ముందు ఆవిష్కరించాలని తెలిపారు.