
వారిద్దరు రోజూ కలిసి తాగుతారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా కలిసి మద్యం సేవించారు. కొంత సమయం తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ వారిద్దరు గొడవపడ్డారు. ఆ మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండతో బాదాడు. దీంతో అతడు చనిపోయాడు. అదే మత్తులో మృతదేహాన్ని పారేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
భర్త ఆఫీసుకు వెళ్లి భార్య వేధించడం క్రూరత్వమే.. విడాకులు సమర్థించిన హైకోర్టు.. ఎక్కడంటే..
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. బజారియా ప్రాంతంలో 56 ఏళ్ల బాబులాల్ తివారీ తన 48 ఏళ్ల డ్రింకింగ్ పార్టనర్ అయిన రఘువీర్ లోధితో కలిసి సోమవారం రాత్రి మద్యం తాగాడు. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తివారీకి కోపం వచ్చింది. పెద్ద బండరాయితో లోధి తలపై బాదాడు. ఈ హఠాత్ పరిణామం వల్ల అతడు చనిపోయాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం: సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అన్నా హాజారే లేఖ
అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి, బట్టలు, చెప్పులు ఎక్కడెక్కడో విసిరేశాడు. మృతదేహాన్ని ద్వారకానగర్ లోని నూలు సమీపంలో పడేశాడు. ఈ దృశ్యాలు అన్నీ స్థానికంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే మరుసటి రోజు ఆ మృతదేహం బజారియా పోలీసులకు లభించింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మృతుడు చోలాలోని శివశక్తి నగర్ లో నివాసం ఉండే రఘువీర్ లోధి అని గుర్తించారు. అతడు మిఠాయిలు అమ్మేవాడని తెలుసుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీలో నిరసనల పర్వం.. రాత్రంతా ఆందోళనలు చేపట్టిన ఎమ్మెల్యేలు
నిందితుడు బాబూలాల్ తివారీని పట్టుకొని విచారించారు. మద్యం మత్తులో గొడపడి హత్య చేశానని ఒప్పుకున్నాడు. కానీ ఎందుకు అతడిని చంపాల్సి వచ్చిందో తనకు సరిగా గుర్తులేదని నిందితుడు తెలిపాడని ఏసీపీ అభినయ్ విశ్వకర్మ తెలిపారు.