భారత్ జోడో యాత్ర నిర్వహించొద్దు.. అది హింస‌కు దారి తీస్తుంది - కాంగ్రెస్ కు బీఎస్ య‌డియూర‌ప్ప హెచ్చ‌రిక

By team teluguFirst Published Aug 23, 2022, 3:06 PM IST
Highlights

కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టకూడదని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ య‌డియూర‌ప్ప సూచించారు. దీని వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించారు. 

కాంగ్రెస్ చేపట్టాలని భావిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’ హింసకు దారితీస్తుందని బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఒక వేళ యాత్రలో హింసాత్మక ఘటనలు జరిగితే దానికి పూర్తిగా సిద్ధరామయ్యనే బాధ్యుడు అవుతాడని ఆయన హెచ్చరించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

నిరసనల సాకుతో పాదయాత్ర చేయడం తగదని, కాంగ్రెస్‌ అధినేత సిద్ధరామయ్య సంయమనం పాటించాలని య‌డియూర‌ప్ప అన్నారు. ప్రతిపాదిత పాదయాత్ర జరిగితే లక్షలాది మంది జనం గుమికూడే అవకాశం ఉందని చెప్పారు. అది విపత్తును తలపిస్తుందని, దీనికి సిద్ధరామయ్య పూర్తిగా బాధ్యత వహించాలని తెలిపారు.

సుప్రీంకోర్టు ప్ర‌త్యేక బెంచ్ కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ పిటిషన్లు

సావర్కర్ దేశభక్తిని బహిరంగంగా వ్యాప్తి చేయడానికి మైసూరులో ‘సావర్కర్ రథయాత్ర’ను జెండా ఊపి ప్రారంభించిన రోజే యడ్యూరప్ప ఈ హెచ్చరికలను జారీ చేశారు. ఈ విష‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖ రాజకీయ నాయకుడు సావర్కర్ దేశభక్తిని ప్రజలకు వ్యాప్తి చేయడమే రథయాత్ర ముఖ్య ఉద్ధేశం అని చెప్పారు. ఈ యాత్ర కొన్ని వందల మందితో శాంతియుతంగా జరుగుతుంద‌ని తెలిపారు. ‘‘ ఈ రథయాత్రను ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నాను. ఒక వైపు భారతదేశం విశ్వగురువుగా మారే మార్గంలో పయనిస్తుండగానే మరోవైపు మనం సమస్యలను ఎదుర్కొంటున్నాం. కొన్ని ఘటనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. కర్ణాటకలో సావర్కర్ పై వివాదం నన్ను బాధించింది.’’ అని ఆయ‌న అన్నారు. 

స్వాతంత్య్ర దినోత్సవం రోజున క‌ర్ణాట‌క‌లో శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్‌లో వినాయక్ దామోదర్ సావర్కర్, టిప్పు సుల్తాన్ పోస్టర్లపై జరిగిన హింసకు బీజేపీ, కాంగ్రెస్ లు విమ‌ర్శ‌లు చేసుకున్నాయి. ‘‘సావర్కర్ మరణించినప్పుడు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇద్దరూ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన మాటలు ఇప్పటికీ మనకు మార్గదర్శక శక్తిగా ఉన్నాయి. ఆయ‌న నిర్దేశించిన మార్గంలో నడవడం మన కర్తవ్యం. సావ‌ర్క‌ర్ స్వాతంత్య్ర సమరయోధులలో ప్రముఖుడు. ఇందిరాగాంధీ ఆయనను ‘అద్భుతమైన కుమారుడు’ అని పిలిచారు. అతడి జ్ఞాపకార్థం స్టాంపులను విడుదల చేశారు ” అని ఆయ‌న అన్నారు. 

13యేళ్ల బాలుడి గొంతుకోసి చంపిన 16యేళ్ల బాలుడు.. చదువుకోవడం ఇష్టం లేక ఘాతుకం...

కాగా.. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభమవుతుందని, ఇందులో రాహుల్ గాంధీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని కాంగ్రెస్ గత వారం ప్రకటించింది.ఈ పాద‌యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేయ‌నుంది. ఈ యాత్ర దాదాపు 3,500-కిమీ పాటు సాగ‌నుంది. దాదాపు 150 రోజుల్లో ఇది పూర్తవుతుంది.

లిక్క‌ర్ పాల‌సీ స్కామ్ లో క‌విత పేరు రావ‌డం యాదృచ్చికం కాదు - బీజేపీ నేత అమిత్ మాల‌వీయ‌

ఈ విష‌యంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రంలోని 511 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతాలు కొన్ని ఉన్నాయని.. ఆయా ప్రాంతాల్లో యాత్రను స్థానిక అధికారులు, పోలీసులతో చర్చించి ఏఐసీసీ నిర్ణయిస్తుందని అన్నారు. ఎనిమిది జిల్లాల పరిధిలో 21 రోజుల పాటు క‌ర్నాట‌క రాష్ట్రంలో జ‌రిగే పాద‌యాత్ర‌లో త‌మ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొంటార‌ని చెప్పారు. 
 

click me!