Bihar: మొబైల్ దొంగిలిస్తుండగా పట్టుకున్న ప్రయాణికులు.. ట్రైన్ కిటికీ నుంచి వేలాడిదీసిన వీడియో వైరల్

By Mahesh K  |  First Published Jan 17, 2024, 5:40 PM IST

బిహార్‌లో ఓ ప్యాసింజర్ ట్రైన్ నుంచి మహిళ చేతి నుంచి ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేసిన దొంగను ప్రయాణికులు వెంటనే పట్టుకున్నారు. ప్లాట్ ఫామ్ పై ఉన్న దొంగ చేతిని ఆ ప్రయాణికులు కిటికీ గుండా ట్రైన్ లోపలి నుంచి పట్టుకున్నారు. ట్రైన్ వేగం అందుకున్నా వారు వదిలిపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 


Bihar Train: బిహార్‌లో ఓ దొంగ ట్రైన్‌లోని ప్రయాణికురాలి చేతిలో నుంచి ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిటికీ వెలుపల ఉన్న దొంగ చేతిని అలాగే గట్టిగా పట్టుకున్నారు. ట్రైన్ రైల్వే స్టేషన్ దాటి వెళ్లుతున్నా వారు ఆ దొంగ చేయి వదల్లేదు. సుమారు ఒక కిలోమీటరు దూరం మేరకు దొంగను అలాగే కిటికీ నుంచి వేలాడదీస్తూ వెళ్లారు. మరికొందరు ప్రయాణికులు ఆ ఘటనను వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన బిహార్‌లోని భగల్‌పూర్ స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగినట్టుగా చెబుతున్నారు.

ఓ ప్యాసింజర్ ట్రైన్ భగల్‌పూర్ స్టేషన్ వచ్చి ఆగింది. ఓ మహిళ ఫోన్‌లో మాట్లాడుతున్నది. అది గమనించిన ఓ దొంగ ఆమె చేతిలో నుంచి ఫోన్ కొట్టేయాలని అనుకున్నాడు. ట్రైన్ మూవ్ అవుతుండగానే పరుగున వచ్చి ఆ ట్రైన్‌ లాక్కున్నాడు. ఇంతలోనే ప్రయాణికులు ఆ దొంగను పట్టుకున్నారు. అప్పుడు ప్రయాణికురాలు ట్రైన్ లోపలి వైపు ఉంటే.. దొంగ ప్లాట్ ఫామ్ పై ఉన్నాడు.

Latest Videos

Also Read : Gudivada: సీనియర్ ఎన్టీఆర్ సీటుపై టీడీపీ ఫోకస్.. కొడాలి నాని టార్గెట్.. పోటాపోటీగా వర్ధంతి కార్యక్రమాలు

ట్రైన్ వేగం అందుకున్నా వారు ఆ దొంగను వదిలిపెట్టలేదు. ఆ దొంగ చేతిని బలంగా పట్టుకున్నారు. ఆ దొంగ తన చేయి విరిగిపోతుందని, దయచేసి తనను వదిలిపెట్టాలని వేడుకుంటున్నాడు. వారు మాత్రం గుణపాఠం చెప్పితీరాల్సిందే అన్నట్టుగా వదిలిపెట్టలేదు. అయితే, అంతలోపే ఎవరో చైన్ లాగగా ట్రైన్ స్లో అయింది. స్లో అవుతుండగానే కొందరు యువకులు ఆ దొంగను కొట్టడానికి వస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ట్రైన్ ఆగగానే ఆ దొంగను విడిపించుకుని మోసుకుని తీసుకెళ్లారు. వచ్చిన ఆ యువకులు కూడా దొంగ గ్యాంగే అని ప్రయాణికులు అంటున్న ముచ్చట్లు వీడియోలో వినిపించాయి. మొబైల్ ఫోన్ కోసం ప్రాణాలనే రిస్క్‌లో పెట్టడమా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

click me!