భర్త మోడీ పేరు జపిస్తే భోజనం పెట్టొద్దు - మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి

By Sairam Indur  |  First Published Mar 10, 2024, 2:47 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ మహిళ కోసం ఏం చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరి ఎందుకు బీజేపీకి ఓటేయాలని ఆయన అన్నారు. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలని ఆయన మహిళలను కోరారు.


భర్తలు ప్రధాని నరేంద్ర మోడీ పేరు జపిస్తే వారికి భోజనం పెట్టకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళకు సూచించారు. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో 'మహిళా సమ్మాన్ సమరోహ్' పేరుతో జరిగిన టౌన్ హౌల్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. చాలా మంది పురుషులు ప్రధాని మోడీ పేరును జపిస్తున్నారని, కానీ మీరు (అక్కడి మహిళలను ఉద్దేశించి)దానిని సరిదిద్దాలని అన్నారు.

ఎన్డీఏలోకి టీడీపీ, జనసేనలకు స్వాగతం - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

Latest Videos

‘‘మీ భర్త మోడీ పేరు జపిస్తే, మీరు ఆయనకు భోజనం పెట్టబోమని చెప్పండి’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు, ఆప్ కు మద్దతివ్వాలని కోరారు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయంలో ప్రమాణం చేయించాలని మహిళలకు సూచించారు. ‘‘మీ సోదరుడు కేజ్రీవాల్ మాత్రమే మీకు అండగా నిలుస్తారని బీజేపీకి మద్దతిచ్చే ఇతర మహిళలకు చెప్పాలి’’ అని ఆయన మహిళలను కోరారు.

గుట్టలు, కొండలకు రైతుబంధు ఇవ్వబోం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘‘నేను ఉచితంగా విద్యుత్ ఇవ్వడంతో పాటు బస్సు ప్రయాణాన్ని ఉచితం చేశానని చెప్పండి. అలాగే ఇప్పుడు నేను ప్రతీ నెలా ఈ రూ .1,000 మహిళలకు ఇస్తున్నాను. ఇవ్వన్నీ చెప్పండి. వారి కోసం బీజేపీ ఏం చేసింది? అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఈసారి కేజ్రీవాల్ కు ఓటేయండి’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత పిలుపునిచ్చారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

ఇప్పటి వరకు మహిళా సాధికారత పేరుతో మోసం జరుగుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా.. 2024-25 బడ్జెట్ లో 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.1,000 అందించే పథకాన్ని నగర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలతో సంభాషించడానికి ఈ ‘మహిళా సమ్మాన్ సమరోహ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

click me!