న్యూఢిల్లీలో బోరు బావిలో పడిన చిన్నారి: సహాయక చర్యలు ప్రారంభం

By narsimha lode  |  First Published Mar 10, 2024, 8:34 AM IST

న్యూఢిల్లీలో బోర్ బావిలో  ఓ చిన్నారి పడిపోయాడు. 40 అడుగుల లోతులో  చిన్నారి చిక్కుకుపోయినట్టుగా అధికారులు గుర్తించారు.  చిన్నారిని రక్షించే చర్యలు ప్రారంభించారు.


న్యూఢిల్లీ:  దేశ రాజధాని న్యూఢిల్లీ   వికాస్ పురి కేషోపూర్ మండి సమీపంలో ఢిల్లీ జల్ బోర్డు ప్లాంట్ బోరు బావిలో  ఓ చిన్నారి పడింది. 40 అడుగుల లోతులో  చిన్నారి చిక్కుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆదివారం నాడు తెల్లవారుజామున  1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఎన్‌డీఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.న్యూఢిల్లీలోని  బోర్ బావిలో చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  40 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్టుగా గుర్తించారు.40 అడుగుల బోర్ వెల్ పైపు 1.5 అడుగుల వెడల్పు ఉంది.ఇన్‌స్పెక్టర్ ఇంచార్జీ వీర్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఎన్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దింపారు.  బోరుబావికి సమాంతరంగా  తవ్వడం ప్రారంభించారు.

Latest Videos

undefined


 


 

click me!