ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: దేశభక్తికి రుజువు ఇదేనని సిసోడియా

Published : Feb 11, 2020, 09:45 AM ISTUpdated : Feb 11, 2020, 09:46 AM IST
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: దేశభక్తికి రుజువు ఇదేనని సిసోడియా

సారాంశం

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిజమైన దేశభక్తి అంటే ఏమిటో నిరూపించాయని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ప్రజల కోసం పనిచేస్తే వారు రాజకీయాల్లో అవకాశం ఇస్తారని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలే నిజమైన దేశభక్తి అంటే ఏమిటో రుజువు చేస్తున్నాయని డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. నిజమైన దేశభక్తిని ప్రజలు ఆదరిస్తారని, తమ పార్టీ విజయమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. 

నిజమైన దేశభక్తి ఉంటేనే రాజకీయాల్లో అవకాశం లభిస్తుందని, మనం తప్పకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన అన్నారు. విద్య, వైద్యం వంటి వాటి కోసం పనిచేయాలని ఆయన అన్నారు. 

Also Read: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్: ఆప్ కార్యాలయం వద్ద సంబరాలు

ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తే విజయం సాధిస్తామని ఢిల్లీ ఫలితాలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. తాము బడులు, ఆస్పత్రుల కోసం పనిచేశామని, అవతలివాళ్లు వాతావరణాన్ని చెడగొట్టి హిందూ ముస్లిం అంటూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బిజెపి పుంజుకుంది. 20 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. అయితే,  ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ మార్క్ ను దాటింది.

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు 21 కేంద్రాల్లో జరుగుతోంది. వీటిలో 11 జిల్లాల్లో 9 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడుతున్నాయి. 

Also Read: పోస్టల్ బ్యాలట్లలో కూడా ఆప్ ఆధిపత్యం.... బీజేపీ ఎందుకు కలవరపడుతుంది?

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం