ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: కార్యకర్తల సంబరాలు, ఆప్ ఆఫీస్ కు కేజ్రీవాల్

Published : Feb 11, 2020, 09:10 AM IST
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: కార్యకర్తల సంబరాలు, ఆప్ ఆఫీస్ కు కేజ్రీవాల్

సారాంశం

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ ఆప్ కార్యాలయానికి చేరుకున్నారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హ్యాట్రిక్ దిశగా సాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. 

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆప్ ముందంజలో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ఈ దశలో ఆప్ లో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఆప్ మ్యాజిక్ ఫిగర్ ను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభలో 70 స్థానాలు ఉండగా 50కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది.

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు 21 కేంద్రాల్లో జరుగుతోంది. వీటిలో 11 జిల్లాల్లో 9 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు
Republic Day : మీ పిల్లలను రిపబ్లిక్ డే వేడుకలకు తీసుకెళ్ళాలా..? ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లోనూ టికెట్లు పొందండిలా