ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరింపులు.. అర్థరాత్రి కాల్ తో పోలీసులు అలర్ట్ !

By Mahesh RajamoniFirst Published Jan 31, 2023, 10:58 AM IST
Highlights

New Delhi: ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయ‌కుడు అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరింపులు వ‌చ్చాయి. ఢిల్లీ పోలీసులకు అర్థరాత్రి కాల్ రావ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకున్నారు. ముండ్కాకు చెందిన ఓ వ్యక్తి  కాల్ చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు.
 

Threat to Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయ‌కుడు అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. ఢిల్లీ పోలీసులకు అర్థరాత్రి కాల్ రావ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకున్నారు. ముండ్కాకు చెందిన ఓ వ్యక్తి  కాల్ చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ముండ్కా ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి అర‌వింద్ కేజ్రీవాల్ ను చంపేస్తాన‌ని బెదిరించాడు. పోలీసులు కాల్ చేసి ఈ బెదిరింపు హెచ్చ‌రిక‌లు చేశాడ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలోనే అత‌ను ముండ్కాకు చెందిన వ్య‌క్తిగా గుర్తించ‌డంతో పాటు అత‌ని మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేద‌ని స‌మాచారం. నిందితుడి పేరు జై ప్రకాష్ అని చెప్పిన‌ట్టు జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. "ఆ వ్యక్తి అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరించాడు. నిందితుడి మానసిక చికిత్స బాగులేదు" అని పోలీసులు తెలిపారు.

సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు పీసీఆర్ కాల్ చేసి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని నిందితులు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కాల్ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి అతడిని గుర్తించారు. సీఎంను చంపేస్తానంటూ బెదిరింపులు చేయ‌డంతో పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు అన్ని వ‌న‌రులు ఉప‌యోగించుకుని వెంట‌నే గుర్తించారు. ప్ర‌స్తుతం కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం నిందితుడి చికిత్స ఢిల్లీలోని గులాబీ బాగ్‌లో కొనసాగుతున్నందున పోలీసులు అతన్ని అరెస్టు చేయలేదని స‌మాచారం.

click me!