భార్యను చంపి బంగ్లాదేశ్ పారిపోయే ప్రయత్నం.. విమానంలో రెండు టికెట్లు బుక్ చేసి.. చివరికి...

By SumaBala BukkaFirst Published Jan 31, 2023, 10:48 AM IST
Highlights

అనుమానంతో భార్యను గొంతు పిసికి చంపాడో వ్యక్తి. ఆ తరువాత ఢిల్లీకి పారిపోయాడు. అక్కడినుంచి బంగ్లాదేశ్ వెళ్లాలని పథకం వేశాడు. కానీ పోలీసులకు చిక్కిపోయాడు. 

కర్ణాటక : కర్ణాటకలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.  భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి రాష్ట్రం విడిచి పారిపోయాడు. ఈ కేసు విచారణలో సదరు నిందితుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి వలస వచ్చాడని తీరింది. కర్ణాటకలోని బసశంకరి నగరంలో సుద్దగుంటెపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాసిర్  హుస్సేన్ అనే వ్యక్తి భార్య నాశనం హత్య చేశాడు. ఆ తర్వాత  విమానం ఎక్కి ఢిల్లీకి పారిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

ఈనెల 16వ తేదీ ఈ హత్య చోటు చేసుకుంది. నగరంలోని తావరకేరే సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో ఉంటున్న నాసిర్ హుస్సేన్, నాజ్ భార్యాభర్తలు. ఏమైందో తెలియదు కానీ భార్య నాజ్ ను గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత దొరకకుండా ఢిల్లీకి పారిపోయాడు. అయితే, హత్య విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని ఢిల్లీలో అరెస్టు చేశారు.

రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించనున్న ఆప్, బీఆర్ఎస్ !

అతనిని దర్యాప్తు చేయగా… విచారణలో అసలు అతను భారతీయుడే కాదని తేలింది. నాజిర్ హుస్సేన్  బంగ్లాదేశ్ లోని ఢాకానివాసి. అతను నాలుగేళ్ల కిందట బెంగళూరుకు వచ్చాడు.  మొబైల్. కంప్యూటర్ హార్డ్వేర్ రిపేరింగ్లలో ట్రైనింగ్ తీసుకున్నాడు.  అయితే అతనికి ఎలాంటి డిగ్రీ లేదు. బంగ్లాదేశ్ నుంచి సిలిగురి ద్వారా కోల్కత్తాకు వచ్చాడు. అక్కడే  నకిలీ ఆధార్, ఇతర పత్రాలను తయారు చేయించుకున్నాడు. ఢిల్లీ, ముంబైలలో  కొన్నాళ్లు పనిచేశాడు.

ఈ నకిలీ సర్టిఫికెట్లతోనే 2019లో బెంగళూరు ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.  నెలకు రూ.75వేలు జీతం వచ్చేది. ఆ తర్వాత బెంగళూరులో నాజ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హత్య సమయానికి ఆమె ఐదు నెలల గర్భవతి. పెళ్లి తర్వాత నాజ్ మీద అనుమానం పెంచుకున్న  నాజీర్ హుస్సేన్ సైకోగా మారాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేశాడని ఆగ్నేయ విభాగ డిసిపి సీకే బాబా తెలిపారు. హత్య తరువాత బెంగళూరు నుంచి వెళ్లిన అతను అక్కడి నుంచి బంగ్లాదేశ్ కి వెళ్లాలని  అనుకున్నాడు.

హత్య కేసులో తనని వెతుక్కుంటూ వచ్చే పోలీసుల కళ్ళు కప్పడానికి తన పేరుతోనే రెండు విమానం టికెట్లు బుక్ చేశాడు.  అయితే పోలీసులు నాసిర్ ను పట్టుకోవడానికి పకడ్బందీగా ప్లాన్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఏడుగురు ఎస్పీలతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ.. నిందితుడిని  పశ్చిమబెంగాల్లోని ఇస్లాంపురం వద్ద అరెస్టు చేశారు. 

click me!