పెళ్లి తర్వాత కూడా ప్రియుడితో సంబంధం.. భర్తకు తెలియడంతో...

Published : Jan 31, 2023, 10:42 AM IST
పెళ్లి తర్వాత కూడా ప్రియుడితో సంబంధం.. భర్తకు తెలియడంతో...

సారాంశం

ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో అతను ఆమెకు నచ్చ చెప్పాడు. దీంతో...ఆమె మారిపోయి.. ప్రియుడిని దూరం పెట్టింది.

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ... పెద్దల కారణంగా  వారు విడిపోవాల్సి వచ్చింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం అయ్యింది. అయినా... వీరు ఒకరినొకరు మర్చిపోలేకపోయారు. దీంతో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే... తీరా అది ఆమె భర్తకు తెలిసిపోయింది. దీంతో... పథకం ప్రకారం... భర్తతో కలిసి ప్రియుడినే చంపేసింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని  గ్వాలియర్‌కు చెందిన రాజ్‌వీర్ (30) అనే యువకుడు వృత్తిరీత్యా డ్రైవర్‌. అతను ఓ మహిళను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు.  అయితే...ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరి బంధంకొనసాగింది. అయితే... ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో అతను ఆమెకు నచ్చ చెప్పాడు. దీంతో...ఆమె మారిపోయి.. ప్రియుడిని దూరం పెట్టింది. అయితే రాజ్ వీర్ మాత్రం... ఆమెను వదల్లేదు. తనతో బంధం కొనసాగించాలంటూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో... సదరు మహిళ ప్రియుడిని వదిలించుకోవాలని అనుకుంది. అందుకు భర్త, సోదరుడి సహాయం తీసుకుంది. పథకం ప్రకారం... ప్రియుడిని హత్య చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !