డీప్‌ఫేక్ : ఆందోళనకర అంశం, చాట్‌జిపిటి వార్నింగ్ ఇవ్వాలి.. ప్రధాని మోడీ

By SumaBala Bukka  |  First Published Nov 17, 2023, 2:01 PM IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం అని ప్రధాని మోదీ అన్నారు. 


న్యూఢిల్లీ : డీప్‌ఫేక్ వీడియోలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వీటిని రూపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేయడం పెద్ద ఆందోళనకరమైన విషయం అని ప్రధాని ధ్వజమెత్తారు.

డీప్‌ఫేక్‌లను ఫ్లాగ్ చేయాలని, అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రసారం అయినప్పుడు వార్నింగ్ ఇవ్వాలని తాను ఛాట్ జీపీటీ బృందాన్ని కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం అని ఆయన చెప్పుకొచ్చారు. 

Latest Videos

undefined

Kulgam encounter: కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం..

ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను ప్రధాని కోరారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. పరిష్కారాలను పొందాలని కేంద్రం సూచించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడడం న్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల "చట్టపరమైన బాధ్యత" అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గత వారం చెప్పారు.

"ప్రభుత్వం.. అటువంటి కంటెంట్ కు లక్ష్యంగా మారుతున్న మన పిల్లలు, మహిళల భద్రత, విశ్వసనీయతను చాలా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది’’ అన్నారు. డీప్‌ఫేక్‌లను సృష్టించడం, సర్క్యులేట్ చేయడం లాంటి వాటికి శిక్షగా.. రూ. లక్ష వరకు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని కేంద్రం తెలిపింది. ఇటీవలి కాలంలో అనేక డీప్‌ఫేక్ వీడియోలు.. రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్‌లవి సోషల్ మీడియాలో వెలుగు చూసి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆగ్రహానికి కారణం అయ్యాయి. 

click me!