సన్నీ లియోన్ ను ఇలా చూసి గుర్తుపడతారా?

Google News Follow Us

సారాంశం

రాహుల్ భట్‌తో కలిసి 'సన్నీలియోన్ నటించిన తాజా చిత్ర కెన్నెడీ. ఇది అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మంచి టాక్ తెచ్చుకుంది. 

ఉత్తరప్రదేశ్‌ : బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురువారం వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన వారణాసిలో  ఆమె గంగా హరతిలో పాల్గొన్న వీడియో వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ X (గతంలో ట్విటర్)లో షేర్ చేసింది. పింక్ అనార్కలి వేసుకుని సంప్రదాయాన్ని పాటిస్తూ ఆచారాల్లో పాల్గొన్నారు సన్నీ లియోన్. సన్నీ లియోన్‌తో పాటు నటుడు అభిషేక్ సింగ్ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పాట థర్డ్ పార్టీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.

సన్నీ లియోన్ తన వారణాసి పర్యటనకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. "వారణాసిలో గంగా హారతి చూడటం అత్యంత అద్భుతమైన అనుభవం. ధన్యవాదాలు!! అభిషేక్ సింగ్, టి సిరీస్ లకు ధన్యవాదాలు" అని తెలిపింది. 

గ్లోబల్ సౌత్ సమ్మిత్ : గాజా యుద్ధంలో పౌరుల మరణాలు దారుణం.. ప్రధాని మోడీ

నవంబర్ 15న థర్డ్ పార్టీని మేకర్స్ విడుదల చేసారు. దీనిని అభిషేక్ సింగ్  స్వరపరిచి, పాడారు. సాహిత్యం కూడా ఆయనే రాశారు. గత నెలలో, సన్నీ లియోన్ మేరా పియా ఘర్ ఆయా 2.0ని రిలీజ్ చేశారు. యారానా సినిమాలోని క్లాసిక్ ట్రాక్‌కి ఆధునిక వెర్షన్ ఇది. దీన్ని నీతి మోహన్ పాడారు. సన్నీ లియోన్ జిస్మ్ 2, జాక్‌పాట్, షూట్‌అవుట్ ఎట్ వడాలా, రాగిణి ఎంఎంఎస్ 2 వంటి సినిమాల్లో నటించారు. రాహుల్ భట్‌తో కలిసి నటించిన ఆమె తాజా చిత్ర కెన్నెడీ. ఇది అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మంచి టాక్ తెచ్చుకుంది.