నోట్లో గంగాజలం పోయగానే.. చితిపై లేచి కూర్చున్న వృద్ధుడు..!!

By SumaBala BukkaFirst Published Dec 28, 2021, 7:03 AM IST
Highlights

చితికి నిప్పంటించే ముందు నోట్లో గంగాజలం పోశారు. అంతే వృద్ధుడిలో ఒక్కసారిగా కదలిక కనిపించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అనంతరం మాట్లాడారు కూడా. ఈ పరిణామంతో కుటుంబసభ్యులు ముందు షాక్ తిన్నారు. తరువాత సంతోషించారు. అయితే డాక్టర్లు తప్పుగా నిర్థారించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు,

ఢిల్లీ :  ఢిల్లీ సమీపంలోని డిగ్రీ గుర్తు ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో Funerals జరుగుతాయనగా.. చితి మీద ఉంచిన వృద్ధుడు కళ్లు తెరిచాడు. అతడు మరణించినట్లు వైద్యులు తప్పుగా ధ్రువీకరించడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.  సతీష్ భరద్వాజ (62) అనే వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతూ ప్రముఖ ఆస్పత్రిలో చేరాడు.  సోమవారం వేకువజామున బాధితుడు తుది శ్వాస విడిచాడని ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు  తెలిపాయి. ఏకంగా పదకొండు మంది వైద్యులు అతని మృతిని నిర్ధారించారు.

దీంతో తెల్లవారుజామున 3 గంటలకు అంత్యక్రియల కోసం Cemeteryకి తీసుకెళ్లారు. చితికి నిప్పంటించే ముందు నోట్లో గంగాజలం పోశారు. అంతే Old manలో ఒక్కసారిగా కదలిక కనిపించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అనంతరం మాట్లాడారు కూడా. ఈ పరిణామంతో కుటుంబసభ్యులు ముందు షాక్ తిన్నారు. తరువాత సంతోషించారు. అయితే Doctors తప్పుగా Confirming చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు,

ఆ తరువాత వృద్ధుడిని నరేలాలోని రాజా హరిశ్చంద్ర ఆస్పత్రిలో చేర్చారు. సతీష్ భరద్వాజ్ బిపి, గుండె కొట్టుకోవడం సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.  మెరుగైన వైద్యం కోసం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

నకిలీ అధికారుల డ్రగ్ కేసు బెదిరింపులు.. భయంతో యువ నటి ఆత్మహత్య

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే గతంలో ఝార్ఖండ్ లో చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఛత్రాలోని సోఖా ప్రాంతంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకొంది. చనిపోయిందనుకొని భావించిన ఓ బాలిక చితిమీద పడుకోబెట్టగానే ఆమె లేచి కూర్చొంది. దీంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు.

జార్ఖండ్‌లోని ఛత్రాలోని సోఖా ప్రాంతంలో అమర్‌చౌదరి కి ఓ కూతురు ఉంది. ఆమె పేరు క్రాంతికుమారి. ఆమె వయస్సు 16 ఏళ్లు. రాత్రి పడుకొన్న తర్వాత క్రాంతి కుమారిని పాము కాటేసింది. అయితే ఉదయంపూట క్రాంతి కుమారి లేవలేదు. అయితే ఆమె చనిపోయిందని భావించారు.  కర్మకాండలు చేసేందుకు ఏర్పాట్లుచేశారు. స్మశానికి  డెడ్ బాడీని తీసుకెళ్లారు. చితి మీద ఆ బాలికను పడుకోబెట్టగానే ఆమె లేచి కూర్చోంది.

చితి మీద ఆ బాలికను పడుకోబెట్టగానే ఆ బాలిక లేవగానే  కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు.

Omicron: కేర‌ళ‌లో ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. నైట్ క‌ర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు

వైద్యులు మెరుగైన చికిత్స కోసం మగథ్ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఆమెను అక్కడకు తరలిస్తున్న క్రమంలోనే ఆ బాలిక చనిపోయింది. అయితే బాలికకు పాము కరిచిందని సకాలంలో ఆమెను ఆసుపత్రిలోకి చేర్పిస్తే  బతికే అవకాశం ఉండేదని వైద్యులు చెప్పారు.

click me!