పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

By narsimha lodeFirst Published Aug 6, 2019, 4:37 PM IST
Highlights

నేషనల్ కాన్పరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 రద్దుపై తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై తాను కోర్టును  ఆశ్రయించనున్నట్టు ఆయన ప్రకటించారు. 

న్యూఢిల్లీ:ఆర్టికల్ 370  రద్దు నిర్ణయంపై నేషనల్ కాన్పరెన్స్  చీఫ్ ఫరూక్ అబ్దుల్లా  తీవ్రంగా స్పందించారు.మోడీ నియంతలా వ్యవహరించాడని ఫరూక్ మండిపడ్డారు.

మంగళవారం నాడు ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని తన నివాసంలో  మీడియాతో మాట్లాడారు. తన గురించి పార్లమెంట్ లో  హోంమంత్రి అమిత్ షా అబద్దాలు చెప్పారని ఆయన ఆరోపించారు.  రాజ్యాంగ వ్యతిరేకంగా  ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ కోర్టును  ఆశ్రయించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. తన కొడుకును జైల్లో పెట్టారని ఆయన చెప్పారు. తమ ప్రజలను కూడ జైల్లో పెట్టారని ఆయన చెప్పారు. 

తనను కలిసేందుకు వచ్చేవారిని పోలీసులు అనుమతించడం లేదని ఆయన గుర్తు చేశారు.  ముఖ్య నేతలను రహస్య ప్రాంతాల్లో నిర్భంధించారని ఆయన ఆరోపించారు.జమ్మూ కాశ్మీర్ విభజనతో పాటు ఆర్టికల్ 370 రద్దుపై ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

 

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

click me!