బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరో సారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయనను చంపేస్తామంటూ వచ్చిన మెయిల్ లో ఈ సారి రాఖీ సావంత్ పేరు కూడా పేర్కొన్నారు. సల్మాన్ కు దూరంగా ఉండాలని ఆమెను హెచ్చరించారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మరో సారి హత్యా బెదిరింపులు వచ్చాయి. ఆయన నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ విడుదలకు రెండు రోజుల ముందు వచ్చిన ఈ తాజా బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సారి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఖాన్ ను చంపుతామని ఇమెయిల్ ద్వారా బెదిరించినట్లు ‘న్యూస్ 18’ నివేదించింది. అయితే ఈ సారి రాఖీ సావంత్ పేరును కూడా అందులో పేర్కొన్నారు. ఈ విషయం నుంచి దూరంగా ఉండమని ఆమెను ఆ లేఖలో హెచ్చరించారు.
అతిక్, అష్రఫ్ హత్య కేసు.. ముగ్గురు షూటర్లకు 4 రోజుల కస్టడీ విధించిన ప్రయాగ్ రాజ్ కోర్టు
సల్మాన్ ఖాన్‌కు రాఖీ సావంత్ మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో వీడియోను విడదల చేసిన దాదాపు ఒక నెల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అందులో ఆమె సిట్-అప్ లు చేస్తూ బిష్ణోయ్ గ్యాంగ్‌కు క్షమాపణలు చెప్పింది. “మెయిన్ సల్మాన్ ఖాన్ భాయ్ కి తారాఫ్ సే బిష్ణోయ్ సమాజ్ సే మాఫీ మాంగ్తీ హు. మేరే భాయ్ సల్మాన్ పర్ బురీ నాజర్ మత్ రాఖో. (సల్మాన్ ఖాన్ తరపున నేను బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెబుతున్నాను, దయచేసి ఆయన గురించి చెడుగా మాట్లాడకండి). మే కెహ్తీ హు సల్మాన్ ఖాన్ ఏక్ నెక్ ఇన్సాన్ హై.. గరీబీ కా డేటా హై, ఏక్ లెజెండ్ హై.. సల్మాన్ భాయ్ కే లీ దువా కరో, వో లోగో కే లీ ఇత్త్నా కర్తే హై.. మే చాహ్తీ హు సల్మాన్ భాయ్ కే దుష్మనో కీ ఆఖే ఫట్ జే.. ఉన్న్కీ యాదశ్ శక్తి ఖతం హోజాయే.. మే అల్లా సే దువా కార్తీ హు కే కోయి మేరే సల్మాన్ భాయ్ కే లై బురా నా సోచే” (సల్మాన్ ఖాన్ ఒక గొప్ప వ్యక్తి. ఒక లెజెండ్. పేదలకు సాయం చేస్తారు. ఆయనను క్షమించండి) అని రాఖీ ఆమె అందులో చెప్పారు.
సల్మాన్ ఖాన్ చాలా కాలం నుంచి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు అనేక సార్లు హత్య బెదిరింపులు వచ్చాయి. గత నెల 30వ తేదీన కూడా సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ‘రాఖీ భాయ్’ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే తరువాత విచారణలో ఈ బెదిరింపులకు పాల్పడింది షాపూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడని తేలింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది మార్చిలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని అన్నాడు. కృష్ణజింకను చంపినందుకుగాను ఆయన తమ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే అది ముగుస్తుందని అన్నారు. కాగా.. కృష్ణజింకలను లారెన్స్ బిష్ణోయ్ సమాజం తమ ఆధ్యాత్మిక నాయకుడు భగవాన్ జాంబేశ్వర్ పునర్జన్మ అని నమ్ముతారు. దానిని జంబాజీ అని కూడా పిలుస్తారు.
ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోయిస్టుల దాడి.. ఆకస్మిక కాల్పులు.. ఎక్కడంటే ?
ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన సినిమాలో టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ దగ్గుబాటి కూడా నటించారు. ఇందులో పూజా హెగ్డే, భూమికా చావ్లా, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, సిద్ధార్థ్ నిగమ్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 21 న థియేటర్లలోకి రానుంది.