రాజస్తాన్‌లో గేదెను ఢీకొన్న వందేభారత్.. గేదె ఎగిరి మీద పడటంతో వ్యక్తి మృతి

Published : Apr 20, 2023, 06:06 AM IST
రాజస్తాన్‌లో గేదెను ఢీకొన్న వందేభారత్.. గేదె ఎగిరి మీద పడటంతో వ్యక్తి మృతి

సారాంశం

రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో వందే భారత్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. ఆ గేదె గాల్లోకి ఎగిరి సమీపంగానే ఉన్న ఓ వ్యక్తిపై పడింది. సదరు వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు.   

జైపూర్: రాజస్తాన్‌లో దుర్ఘటన జరిగింది. మరోసారి వందేభారత్ అవాంఛనీయ కారణాలతో వార్తల్లోకి ఎక్కింది. రాజస్తాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. వందేభారత్ ట్రైన్ అప్పుడు వేగంగా వెళ్లుతున్నది. అదే వేగంతో గేదెను ఢీకొట్టడంతో అది గాల్లోకి ఎగిరింది. అక్కడే సమీపంలో ఉన్న వ్యక్తి మీద ఆ గేదె పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. 

రాజస్తాన్‌లోని అజ్మేర్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సేవలు అందిస్తున్నది. ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి అజ్మేర్‌కు వస్తుండగా నిన్న దుర్ఘటన జరిగింది. అల్వార్ జిల్లాలోని కాలిమోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్లుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. వందే భారత్ ట్రైన్ అధిక వేగంతో ఉండటంతో ఆ గేదె గాల్లోకి ఎగిరింది. అదే సమయంలో స్పాట్‌కు సమీపంలోనే ఓ వ్యక్తి ఉన్నాడు.

ఆ గేదె ఎగిరి సదరు వ్యక్తిపై పడిపోయింది. దీంతో ఆ వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు. మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి అయిన శివ దయాల్‌గా పోలీసులు గుర్తించారు.

శివ దయాల్ మృతదేహాన్ని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌ మార్చురీకి తరలించారు. ఈ ఘటన గురించి శివ దయాల్ కుటుంబానికి సమాచారం అందజేశారు.

రాజస్తాన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?