ఫ్రీగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిపై చెప్పులతో దాడి.. వీడియో వైరల్

Published : Aug 13, 2023, 02:02 PM IST
ఫ్రీగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిపై చెప్పులతో దాడి.. వీడియో వైరల్

సారాంశం

ఓ దళితుడు ఫ్రీగా చికెన్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అతడిని చెప్పులతో కొట్టారు. నడిరోడ్డుపై చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్ పూర్ జిల్లాలో జరిగింది.

ఉచితంగా చికెన్ ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో ఓ దళితుడిపై చెప్పుల దాడి జరిగింది. అతడిని తీవ్రంగా చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ జిల్లాలో జరిగింది. అతడిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం.. పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం..

వివరాలు ఇలా ఉన్నాయి. లలిత్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో సుజన్ అహిర్వార్ అనే దళితుడు చికెన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఇటీవల తన చికెన్ సెంటర్ ను ఓపెన్ చేసి, వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆ గ్రామంలోకి పలువురు యువకులు మద్యం మత్తులో బైక్ పై వచ్చారు. చికెన్ కొడుతున్న సుజన్ అహిర్వార్ ను పిలిచారు.

27 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతించిన బొంబాయి హైకోర్టు.. కానీ సజీవంగా జన్మించిన శిశువు..

ఫ్రీగా తమకు చికెన్ ఇవ్వాలని కోరారు. కానీ తాను ఉచితంగా చికెన్ ఇవ్వాలేనని, డబ్బులు కావాలని అతడు వారికి బదులు ఇచ్చాడు. దీంతో వారు కోపోద్రిక్తులయ్యారు. సుజన్ ను చెప్పులతో తీవ్రంగా కొట్టారు. నడిరోడ్డుపై చితకబాదారు. ఈ ఘటనను అటుగా వెళ్తున్న ఒకరు తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు.

వివాహమైన మాజీ ప్రియుడి కిడ్నాప్.. బలవంతంగా అతడిని మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ ప్రియురాలు..

అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో స్థానిక పోలీసుల వద్దకు చేరింది. నిందితులను, బాధితుడిని వారు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితులపై షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !