Dailyhunt Trust of Nation Survey: 2024 ఎన్నికల నేపథ్యంలో డైలీ హంట్ లోకల్ లాంగ్వేజ్ కంటెంట్ డిస్కవరీ ప్లాట్ఫార్మ్ చేసిన సర్వే లో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ”ట్రస్ట్ ఆఫ్ నేషన్ 2024 సర్వే” ద్వారా కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ సర్వేలో 77 లక్షల మంది అభిప్రాయాన్ని స్వీకరించారు.
Dailyhunt Trust of Nation Survey: అతిపెద్ద ప్రజాస్వామ్యంలో సార్వత్రిక ఎన్నికలు పండుగ వచ్చింది. ఈ పండుగ కోసం యావత్తు దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మహోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ కు కూడా ఎన్నికలు జరుగున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ కంటెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫారమ్ డైలీహంట్ దేశ ప్రజల నాడీని తెలుసుకోవడానికి ‘‘ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ 2024 (Trust Of Nation 2024)” అనే పేరిట ఓ సమగ్ర సర్వే నిర్వహించారు.
ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ 2024 (Trust Of Nation 2024)” నివేదిక ప్రకారం.. నరేంద్ర మోదీనే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశంలో 61 శాతం మంది ప్రజలులు కోరుకుంటున్నారని సర్వే చెబుతోంది. ప్రతి ఐదుగురులో ముగ్గురు నరేంద్ర మోడీనే ప్రధాన మంత్రిగా కొనసాగాలని భావిస్తున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో BJP/NDA కూటమి విజయం సాధిస్తుందని గణనీయంగా 63 శాతం మంది విశ్వసిస్తున్నారని వెల్లడించింది. మరోవైపు.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధానమంత్రి కావాలని కేవలం 21.8 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని తెలిపింది. ఇంగ్లీష్, హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషలు అన్నీ కలిపి మొత్తం 11 భాషల్లో డైలీ హంట్ ట్రస్ట్ ఆఫ్ నేషన్ సర్వేను నిర్వహించింది. ఇందులో మొత్తం 77 లక్షల మంది ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు.
సర్వే వివరాలు క్షుణంగా..
మోదీ పాలన మీద సంతృప్తి…
దేశ ప్రజల్లో చాలా మంది ప్రధాని మోడీ పాలన మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారతదేశాన్ని ఆర్ధికంగా, సామాజికంగా పురోగతి చెందడంలో ప్రధాని నరేంద్ర మోడీ విజయం సాధించారని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. పాలన పరంగా మొత్తం 61 శాతం మంది ప్రజలు నరేంద్ర మోడీ పాలన బాగుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..21శాతం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే.. సంతృప్తికరంగా ఉందని భావించిన వారిలో సగానికి పైగా అంటే 53.3% మంది నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, సంస్కరణలు చాలా బాగున్నాయని అభిప్రాయపడ్డారు.
అలాగే.. ప్రతి పది మందిలో ఆరుగురు ( 60శాతం) ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక పురోగతి పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దక్షిణాదిలో 55 శాతం మంది ప్రజలు కూడా మోడీ పాలన ఆమోదించారు. ఈ సర్వే ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో 52.6 శాతం మంది ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేయగా, 28.1 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
విదేశాంగ విధానం .. ఈ విషయంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది అంటే .. 64 శాతం మంది విదేశీ వ్యవహారాల నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేయగా, 14.5 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంక్షోభ నిర్వహణ.. ఈ విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై 20.5 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేయగా, 10.7 శాతం మంది తటస్థ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సంక్షేమ కార్యక్రమాలు.. మోడీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల గణనీయంగా 53.8 శాతం సంతృప్తిని వ్యక్తం చేయగా, 24.9 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.