వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? కేంద్రం సమాధానం ఏంటి?.. వివరణ కోరిన సుప్రీంకోర్టు

By SumaBala BukkaFirst Published Jan 16, 2023, 2:11 PM IST
Highlights

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తూ దాఖలైన పిటిషన్లపై తుది విచారణ మార్చి 21 నుంచి ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.
 

న్యూఢిల్లీ : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని సమాధానం కోరింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 15లోగా ఈ అంశంపై తన స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ పిటిషన్లపై తుది విచారణ మార్చి 21 నుండి ప్రారంభమవుతుందని తెలిపింది.

ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు స్ప్లిట్ వర్డిక్ట్ కు సంబంధించి ఒక పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ హైకోర్టులో పిటిషనర్లలో ఒకరైన ఖుష్బూ సైఫీ ఈ అప్పీలును దాఖలు చేశారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు గతేడాది మే 11న విభజన తీర్పును వెలువరించింది.

ఇదిలా ఉంటే, న్యాయమూర్తులు.. జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి హరి శంకర్ ల ధర్మాసనం ఒక అంగీకారానికి వచ్చి ఈ విషయంలో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి లీవ్ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఎందుకంటే ఈ కేసు చట్టంలోని అనేక ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నందున ఉన్నత న్యాయస్థానం జోక్యం అవసరం పడింది.

అయోధ్య రామమందిరంపై దాడికి పాక్ ఉగ్ర‌వాదుల కుట్ర‌.. నిఘా హెచ్చ‌రిక‌లు

డివిజన్ బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ శక్ధర్, వైవాహిక అత్యాచార మినహాయింపును "రాజ్యాంగ విరుద్ధం" అని కొట్టివేయడానికి మొగ్గుచూపారు.  IPC అమలులోకి వచ్చిన 162 సంవత్సరాల తర్వాత కూడా "న్యాయం కోసం వివాహిత మహిళ చేసే అభ్యర్థనలు వినకపోతే అది విషాదకరం" అని అన్నారు. ఇక, రేప్ చట్టం ప్రకారం వైవాహిక అత్యాచారానికి మినహాయింపు "రాజ్యాంగ విరుద్ధం కాదు ఇది అర్థమయ్యే భేదంపై ఆధారపడి ఉంది" అని జస్టిస్ శంకర్ అన్నారు.

తన భార్యపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై తన ప్రాసిక్యూషన్‌కు మార్గం సుగమం చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఓ వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేశాడు. భర్తపై అత్యాచారం,  భార్యతో అసహజ శృంగారం ఆరోపణల నుండి మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం)కి విరుద్ధమని కర్ణాటక హైకోర్టు గత ఏడాది మార్చి 23న పేర్కొంది.ఈ అంశంపై సుప్రీంకోర్టులో మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

కొంతమంది పిటిషనర్లు తమ భర్తలచే లైంగిక వేధింపులకు గురయ్యే వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతున్నారనే కారణంతో సెక్షన్ 375 IPC (రేప్) కింద వైవాహిక అత్యాచారం మినహాయింపు రాజ్యాంగబద్ధతను సవాలు చేశారు. IPC సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపు ప్రకారం, ఒక వ్యక్తి తన భార్యతో లైంగిక సంబంధం లేదా లైంగిక చర్యలకు పాల్పడితే, భార్య మైనర్ కాకపోతే, అది అత్యాచారం కిందికి రాదు. 

click me!