
CP Radhakrishnan Sworn In : ఇటీవల భారత నూతన ఉపరాష్ట్రపతిగా అధికార ఎన్డిఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్నికైన విషయం తెెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై ఈయన విజయం సాధించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు రాగా, రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించారు. ఇలా ఎన్నికల్లో విజయం సాధించిన సిపి రాధాకృష్ణన్ తాజాగా ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
శుక్రవారం దేశ రాజధాని న్యూడిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
భారత ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్ర నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతులు జగ్‌దీప్ ధన్‌ఖర్, వెంకయ్య నాయుడు, హమీద్ అన్సారీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.