Covid: సైలెంట్ కిల్లర్.. గుండె పగలగొడుతున్న కరోనా వైరస్

Published : May 28, 2025, 07:16 PM IST
Silent heart attack

సారాంశం

Covid: ఐఐటీ ఇండోర్, ఐసీఎంఆర్ పరిశోధనలో కరోనా డెల్టా వేరియంట్ సైలెంట్ హార్ట్ ఎటాక్, థైరాయిడ్ వంటి సమస్యలకు దారితీస్తుందని తేలింది.

Covid: పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లో కూడా ఇతర దేశాల్లో వ్యాప్తికి కారణమైన వేరియంట్లకు సంబంధించిన కేసులు వెలుగుచూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదివరకు లక్షల మంది ప్రాణాలు తీసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా ప్రాణాలను తీస్తోంది. ఇదే క్రమంలో తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఐఐటీ ఇండోర్, ఐసీఎంఆర్ సంయుక్త పరిశోధనలో కరోనా డెల్టా వేరియంట్ సైలెంట్ హార్ట్ ఎటాక్, థైరాయిడ్ వంటి సమస్యలకు దారితీస్తుందని తేలింది. ఈ పరిశోధన 'జర్నల్ ఆఫ్ ప్రోటీయోమ్ రీసెర్చ్'లో ప్రచురితమైంది.

ఐఐటీ ఇండోర్ నివేదికలో కరోనా వైరస్ పై షాకింగ్ విషయాలు

కరోనా వేరియంట్‌లు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ పరిశోధనలో వివరించారు. దీనివల్ల కరోనా సంబంధిత సమస్యలకు మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుంది. కొన్ని రకాల వేరియంట్లు తీవ్రంగా శరీరాన్ని దెబ్బతీస్తున్నాయని నివేదిక పేర్కొంది. 

సైలెంట్ హార్ట్ ఎటాక్, థైరాయిడ్ సమస్యలు

డెల్టా వేరియంట్ శరీరంలోని రసాయన సమతుల్యతను దెబ్బతీస్తుందనీ, దీనివల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయని పరిశోధనలో తేలింది.

పరిశోధకులు మొదటి, రెండో వేవ్‌లలో 3,134 మంది రోగుల డేటాను విశ్లేషించారు. వారి బ్లడ్ రిపోర్ట్‌లు, యూరియా, క్రియాటిన్ వంటి అంశాలను పరిశీలించారు. ఊపిరితిత్తులు, పేగులపై వైరస్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు.

హార్మోన్లు, శరీర రసాయన వ్యవస్థపై ప్రభావం

డెల్టా వేరియంట్ హార్మోన్లు, శరీర రసాయన వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనీ, దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన భవిష్యత్తులో చికిత్స, నిర్ధారణకు ఉపయోగపడుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?