Covid 19 Third Wave : దేశంలో ఫిబ్రవరిలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభణ.. ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం..

Published : Dec 25, 2021, 10:57 AM IST
Covid 19 Third Wave : దేశంలో ఫిబ్రవరిలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభణ.. ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం..

సారాంశం

ఇప్పటికే థార్డ్ వేవ్ తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్ వేవ్ ప్రభావంపై ఈ అంచానాను వచ్చినట్టు చెప్పింది. దేశంలో థార్డ్ వేవ్ డిసెంబర్ 15వ తేదీకి అటూ, ఇటూగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటు చేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్రస్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది.   

న్యూఢిల్లీ : దేశంలో COVID 19 third wave వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో Omicron వేరియంట్ కారణంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. 

గౌసియన్ మిక్సర్ మోడల్ అనే టూల్ ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరివీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే థార్డ్ వేవ్ తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్ వేవ్ ప్రభావంపై ఈ అంచాను వచ్చినట్టు చెప్పింది. దేశంలో థార్డ్ వేవ్ డిసెంబర్ 15వ తేదీకి అటూ, ఇటూగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటు చేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్రస్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. 

Omicron: వ్యాక్సినేషన్ చాలదు! ప్రతి 10 ఒమిక్రాన్ కేసుల్లో 9 మంది పేషెంట్లకు రెండు డోసులు పూర్తి: కేంద్రం

ఇదిలా ఉండగా, Coronavirus కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో రిపోర్ట్ అయిన తొలినాళ్లలో బయటకు వచ్చిన సమాచారం అప్పుడు కలవర పెట్టిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని అక్కడి పరిశోధనలు తెలిపాయి. అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుత టీకా సామర్థ్యాలను అధిగమించే అవకాశం ఉన్నదని వివరించాయి. ప్రస్తుత టీకాలు ఒమిక్రాన్‌ను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోవచ్చునని తెలిపాయి. తాజాగా.. ఇదే తరహాలో కేంద్రం వ్యాఖ్యలు చేసింది. 

మనదేశంలో ఒమిక్రాన్ బారిన పడ్డ 183 కేసులపై చేసిన విశ్లేషణలను కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం, ఒమిక్రాన్ బారిన పడ్డ ప్రతి పది మందిలో తొమ్మిది మంది రెండు డోసుల టీకాలు వేసుకున్నవారే. ఈ పాయింట్ చెబుతూ.. ఒమిక్రాన్‌ను అడ్డుకోవాలంటే కేవలం Vaccination చాలదని, ఇతర జాగ్రత్తలూ తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. మాస్కులు ధరించడం, నిఘా, వైరస్ చైన్ బ్రేక్ చేయడం కీలకమని వివరించింది.

ఈ సందర్భంలోనే మరో కీలక విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఈ 183 ఒమిక్రాన్ కేసుల్లో 27 శాతం పేషెంట్లకు అసలు విదేశాలు వెళ్లిన చరిత్రే లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. అంటే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కేవలం విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారిలోనే కాదు.. ఇక్కడ ఉన్నవారిలోనూ వెలుగు చూసినట్టు పేర్కొంది. 

ఒమిక్రాన్ బారిన పడ్డ 183 మంది పేషెంట్ల వ్యాక్సినేషన్ స్టేటస్‌ను కేంద్రం తెలిపింది. ఇందులో 73 మంది వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియరాలేదని, కాగా, 16 మంది టీకా తీసుకోవడానికి అనర్హులని పేర్కొంది. అయితే, మిగిలిన వారిలో 87 మంది పేషెంట్లు (91శాతం) రెండు డోసుల టీకా తీసుకున్నారు. కాగా, కేవలం ఏడుగురు మాత్రమే టీకా తీసుకోలేరు. మరో ఇద్దరు ఒక్క డోసు టీకా మాత్రమే తీసుకున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu