సెక్రటేరియేట్‌లో కరోనా కలకలం: ఉద్యోగులు, అధికారుల్లో భయాందోళనలు

By Siva Kodati  |  First Published Mar 17, 2020, 3:55 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రోజు రోజుకు పెరుగుతోంది. దీని కట్టడికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంది. 


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రోజు రోజుకు పెరుగుతోంది. దీని కట్టడికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

ఈ క్రమంలో ఏకంగా రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కరోనా కలకలం రేగడంతో అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దక్షిణ ముంబైలోని సెక్రటేరియేట్‌లో పనిచేసే ఓ సీనియర్ అధికారికి కోవిడ్-19 సోకినట్లు మంగళవారం వదంతులు వ్యాపించాయి. దీంతో ఉద్యోగులు, అధికారులు ఆందోళనకు గురవ్వగా, ఆ వెంటనే ప్రజా పనుల శాఖ అప్రమత్తమై సెక్రటేరియేట్ మొత్తాన్ని శానిటైజేషన్ చేసింది.

Latest Videos

undefined

Also Read:కరోనా దెబ్బ: తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్!

ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ... మహారాష్ట్ర మంత్రాలయంలోని ఓ సీనియర్ అధికారిలో కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో ఆయన వెంటనే సెలవులు తీసుకున్నారని, ఆయన రక్త నమూనాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపామని ఇందులో ఆయనకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు.

సెక్రటేరియేట్‌ను ప్రజా పనుల విభాగం ఆధీనంలోకి తీసుకుని శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టిందని ఆయన వెల్లడించారు. మెట్లు, ఎస్కలేటర్లు, కుర్చీలతో పాటు ప్రతి డిపార్ట్‌మెంట్ ఫ్లోర్‌ను శుభ్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సదరు అధికారి చెప్పారు.

Also Read :భారత్ లో మూడో మరణం... కరోనా సోకి ముంబయిలో వ్యక్తి మృతి

మంత్రాలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కారణంగా ఓ 64 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య భారత్‌లో మూడు చేరుకోగా, వైరస్ సోకిన వారి సంఖ్య 131కి చేరింది. 

click me!