కరోనా దెబ్బ: చేతిపై టాటాల్లా స్టాంపులు, వీరు కనిపిస్తే....

By Sree sFirst Published Mar 17, 2020, 2:56 PM IST
Highlights

ఈ కరోనా వైరస్ ధాటికి ఎయిర్ పోర్టుల్లో కరోనా లక్షణాలను స్క్రీన్ చేస్తున్నారు. ఒకవేళ కరోనా తీవ్రంగా ఉన్న దేశాల నుంచి గనుక ఎవరైనా వస్తే వారికి కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ.... వారిని ఇంట్లోనే ఒక 14 రోజులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికి పోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు పేద, ధనిక అనే తేడా చూపెట్టకుండా అన్ని దేశాలను, ప్రజలను వణికిస్తోంది. ఆ వైరస్ పేరు చెబితేనే ప్రజలు వణికి పోతున్నారు. ఈ వైరస్ ఎంతలా ప్రభావం చూపుతుందంటే... ఏకంగా దేశాల మంత్రులను కూడా వదలడం లేదు. 

కెనడా ప్రధాని భార్యకు కూడా ఈ కరోనా వైరస్ సోకింది. ఇరాన్ మంత్రికి సోకింది, వివిధ దేశాల్లోని ఎంపీలు సైతం ఈ వైరస్ బారిన పడ్డారంటేనే ఈ వైరస్ ఏ లెవెల్ లో కరాళ నృత్యం చేస్తుందో అర్థమవుతుంది. 

ఇక ఈ వైరస్ కి ఇప్పటికీ మందు లేని నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ నివారణకు మొగ్గు చూపుతూ ఆంక్షలను విధిస్తున్నాయి. జనసమ్మర్ధమైన ప్రదేశాలను మూసివేస్తూ ప్రజలను ఇండ్లలోంచి బయటకు రానీయకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. 

Also read: భారత్ లో మూడో మరణం... కరోనా సోకి ముంబయిలో వ్యక్తి మృతి

ఈ కరోనా వైరస్ ధాటికి ఎయిర్ పోర్టుల్లో కరోనా లక్షణాలను స్క్రీన్ చేస్తున్నారు. ఒకవేళ కరోనా తీవ్రంగా ఉన్న దేశాల నుంచి గనుక ఎవరైనా వస్తే వారికి కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ.... వారిని ఇంట్లోనే ఒక 14 రోజులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

ఇందుకు సంబంధించి మహారాష్ట్ర సర్కార్ ఎన్నికలకు వాడే ఇంకు లాంటి ఒక చెరిగిపోని ఇంకుతో వారికి హోమ్ క్వారంటైన్డ్ అని ఏ తారీఖు వరుకు ఇంట్లో ఇలా ఉండాలో కూడా సూచిస్తున్నారు. దాని వల్ల అలా స్టాంప్ ఉండి కూడా ఎవరైనా బయట తిరిగితే వారిని ఇంటికి తిరిగి వెళ్ళమని, వారిని ఇంట్లోనే ఉండమని చెప్పవచ్చు. 

ఇలా చర్యలను తీసుకుంటుంది మహారాష్ట్ర సర్కార్. ఈ కరోనా దెబ్బకు మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమైంది. నేటి ఉదయం అక్కడ దేశంలోనే మూడవ కరోనా మరణం సంభవించింది. సర్కార్ ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 

Also read: విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... చంద్రబాబుకు పరీక్షలు

దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో నేటి వరకు మొత్తం 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా విదేశాలకు పోయి వచ్చిన వారే. అయితే కరోనా రోగుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఇక కరోనా వ్యాప్తి గత వారం ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జిమ్స్‌కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఐటీ బాంబేకు మార్చి 29 వరకు సెలవులు ప్రకటించారు. ముంబయిలోని సిద్ధి వినాయక టెంపుల్‌ను మూసివేశారు.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 114కి చేరింది. మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబయిలో 8, పుణెలో 16, నాగ్‌పూర్‌ 4, నవీ ముంబయి 2, యావత్మల్‌ 3, థానే, కల్యాణ్‌, అహ్మద్‌నగర్‌, ఔరంగాబాద్‌, రాయిగడ్‌లో ఒక్కొక్క కేసు చొప్పు నమోదు అయ్యాయి.

click me!