Corona: కరోనా కేసుల్లో భారీ ఊరట.. మరణాలు 200లోపే.. తాజా వివరాలివే..!

By telugu teamFirst Published Nov 16, 2021, 12:38 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. టీకా పంపిణీ కూడా వేగంగా జరుగుతుండటంతో దేశంలో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న కొత్తగా తొమ్మిది వేల లోపే 8,865 మందికి కరోనా సోకింది. కాగా, మరణాలు 200 లోపే రిపోర్ట్ అయ్యాయి. యాక్టివ్ కేసులూ 525 రోజుల కనిష్టానికి చేరాయి. దేశంలో అత్యధిక కేసులు కేరళ నుంచే నమోదవుతున్నాయి.
 

న్యూఢిల్లీ: దేశంలో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. Corona టీకా పంపిణీ (Vaccination) వేగం అందుకుంటున్నది. అలాగే, కరోనా కేసుల్లోనూ తగ్గుదల కనిపిస్తున్నది. తాజాగా, తొమ్మిది నెలల కనిష్టానికి Caseల సంఖ్య చేరాయి. నిన్న సింగిల్ డే కేసులు తొమ్మిది వేల లోపే నమోదయ్యాయి. కొత్తగా 8,865 మంది కరోనా బారిన పడ్డారు. గత నెల రోజులుగా కరోనా కేసులు పది వేల లోపే రిపోర్ట్ అవుతున్నాయి. తాజాగా 8,865 కేసులు తొమ్మిది నెలల్లోనే కనిష్టం (Lowest). 287 రోజుల్లో తొలిసారిగా ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అలాగే, మరణాల సంఖ్యలోనూ ఊరట కనిపిస్తున్నది. తాజాగా 197 మంది కరోనా Pandemicతో మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మరణాల సంఖ్య 4,63,852కు చేరింది.

రికవరీ రేటుగా మెరుగ్గా ఉన్నది. మార్చి 2020 నుంచి అత్యధిక రికవరీ రేటు నమోదైంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.2శాతంగా ఉన్నది. నిన్న ఒక్క రోజే 11,971 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3,38,61,756కు పెరిగింది. కాగా, డైలీ పాజిటివిటీ రేటు భారీగా తగ్గింది. గత 43 రోజులుగా రెండు శాతం ఉండగా నేడు ఇది 0.80శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసులూ తగ్గుముఖం పట్టడం పరిస్థితులను మెరుగు పరుస్తున్నది. గత 525 రోజుల్లో అత్యంత కనిష్ట స్థాయిలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటి వరకు దేశంలో యాక్టివ్ కేసులు 1,30,793గా ఉన్నాయి.

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం కేసులు 20,70,095కి చేరిక

దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో కేరళలోనే ఎక్కువగా నమోదయ్యాయి. కేరళలో 4,547 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 57గా ఉన్నది. కరోనా టీకా పంపిణీ కూడా వేగంగా జరుగుతున్నది. దేశవ్యాప్తంగా 112.97 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే 59,75,469 డోసులు పంపిణీ చేసినట్టు వివరించింది.



𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/a1k44HRG5o pic.twitter.com/XEdO73xs3a

— Ministry of Health (@MoHFW_INDIA)

ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి

click me!