కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు.. ‘హిందూత్వ’పై వ్యాఖ్యలే కారణం?

By telugu teamFirst Published Nov 15, 2021, 8:47 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఉత్తరాఖండ్‌లో నైనిటాల్‌లోని ఖుర్షీద్ నివాసంలో ఈ రోజు మంటలు చెలరేగాయి. అయోధ్యపై ఆయన రాసిన పుస్తకంలో హిందూత్వపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంతరి సల్మాన్ ఖుర్షీద్ నివాసానికి మంటలు పెట్టారు.
 

న్యూఢిల్లీ: Congress సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి Salman Khurshid ఇంటికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. Ayodhyaపై ఆయన రాసిన పుస్తకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అందులో ‘హిందూత్వ’ను ఉగ్రవాద సంస్థలతో పోలికలు పెట్టారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ నేపథ్యంలోనే నైనిటాల్‌లోని ఆయన ఇంటికి కొందరు Fire పెట్టారు. మంటలకు సంబంధించిన వీడియోను సల్మాన్ ఖుర్షీద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంటి తలుపులు కాలిపోయాయి. కిటికీలు, గోడలు నల్లబారాయి. 

ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సల్మాన్ ఖుర్షీద్ తన వైఖరిని సమర్థించుకున్నారు. తాను ఇప్పటికీ ఈ డోర్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఇది హిందూయిజం కాదని అంటున్న తన వాదన ఇప్పటికే తప్పేనా? అంటూ ప్రశ్నించారు. అయితే, ఇలా చర్చిస్తారా? ఈ చర్యను పేర్కొనడానికి సిగ్గు చేటు అనే పదం చాలా చిన్నదని ఆగ్రహించారు. అయినప్పటికీ కనీసం చివరికి భిన్నాభిప్రాయాలపైనా ఒక ఏకాభిప్రాయానికి వస్తామని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

https://t.co/olsAmUzebQ

— Salman Khurshid (@salman7khurshid)

Also Read: నిన్న సల్మాన్ ఖుర్షీద్.. నేడు రషీద్ అల్వీ.. రామభక్తులు నిశాచరులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు...

కాగా, డీఐజీ నీలేశ్ ఆనంద్ మాట్లాడుతూ, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, 21 మందిపై కేసు నమోదైందని వివరించారు. రాకేశ్ కపిల్‌తోపాటు మరో 20 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ ఘటనపై మరో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మండిపడ్డారు. ఇది అవమానకరంగా ఉన్నదని పేర్కొన్నారు. సల్మాన్ ఖుర్షీద్ ఒక రాజనీతిజ్ఞుడని, అనేక అంతర్జాతీయ వేదికలపై భారత దేశ గొప్పతనాన్ని సగర్వంగా చాటారని వివరించారు. మధ్యేవాది అని, సంఘటిత దృక్పథం గల వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై ఈ దాడి తగదని అభిప్రాయపడ్డారు. ఈ అసంతృప్తి జ్వాలలను అధికారపక్షం కచ్చితంగా నియంత్రించాలని సూచించారు.

సన్‌రైజ్ ఓవర్ అయోధ్య అనే పుస్తకాన్ని సల్మాన్ ఖుర్షీద్ ఇటీవలే విడుదల చేశారు. అందులో ఓ ప్యారాగ్రాఫ్ ఇప్పుడు వివాదాన్ని కేంద్రమైంది. సనాతన ధర్మం, క్లాసికల్ హిందూయిజం రుషులు, పండితులకు పేరు గలదని అందులో పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని పక్కనపెట్టేసే కొత్త హిందూత్వ వర్షన్ తెరమీదకు వచ్చిందని వివరించారు. దీన్ని ఒక పొలిటికల్ వర్షన్‌గా ఆయన పేర్కొన్నారు. ఇస్లాంలో జిహాదిస్టు గ్రూపులు ఐఎస్ఐఎస్, బోకో హరాం తరహాలోనే ఇక్కడ హిందూత్వ వర్షన్ ముందుకు వచ్చిందని అభిప్రాయపడ్డారు.

Also Read: నా మీద సానుభూతి చూపించడండి.. బాబ్రీ కూల్చివేత సమయంలో.. మాజీ ప్రధాని పీవీ..!

ఈ పోలిక దుమారం రేపింది. ఆయన అభిప్రాయాలు హిందువుల మనోభావాలను గాయపరిచాయని, ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్నదని BJP విమర్శలు చేసింది.

సల్మాన్ ఖుర్షీద్‌ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించారు. హిందూయిజం, Hindutva రెండు వేర్వేరు అని ఆయన పేర్కొన్నారు. ఆ రెండింటి మధ్య తేడాను గమనించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలనూ బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ, ఆయన పార్టీలో హిందువులపై విద్వేషం ఉన్నదని విమర్శించింది.

click me!