ఆర్ధిక రాజధానిపై కరోనా పంజా: ముంబైలో ఒక్కరోజే 357 కేసులు, 4,589కి బాధితుల సంఖ్య

By Siva Kodati  |  First Published Apr 24, 2020, 9:48 PM IST

కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వణికిస్తోంది. నగరంలో రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్న కోవిడ్ 19ను ఎలా కట్టడి చేయాలో ఉద్దవ్  సర్కార్ తలలు పట్టుకుంటోంది.


కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వణికిస్తోంది. నగరంలో రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్న కోవిడ్ 19ను ఎలా కట్టడి చేయాలో ఉద్దవ్  సర్కార్ తలలు పట్టుకుంటోంది.

కాగా శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 357 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజులోనే 122 మంది కోలుకుని డిశ్చార్జ్ కావడం కాస్త ఊరట కలిపించే అంశం.

Latest Videos

Also Read:ఇండియాపై కరోనా దెబ్బ: మొత్తం కేసులు 23,077కి చేరిక, 718 మంది మృతి

తాజా కేసులతో ఇప్పటి వరకు ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,589కి చేరింది. మొత్తం 595 మంది కోలుకోగా, 179 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ముంబై నగర పాలక సంస్థ శుక్రవారం ప్రకటించింది.

మరోవైపు భారతదేశంలో శుక్రవారం నాటికి దేశంలో 1,684 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కి చేరుకున్నాయి. 37 మంది మరణించంతో మొత్తం మరణాల సంఖ్య 718కి చేరుకుంది.

Also Read:నేలపై పోలీసుల నిద్ర: ఫొటోలు వైరల్, కరోనా సమరయోధులకు థ్యాంక్స్

దేశంలో అత్యధికంగా మహరాష్ట్రలో 6,430 కేసులు నమోదయ్యాయి. వీరిలో 640 మంది కరోనా నుంచి కోలుకుని, 280 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో 2,376 కేసులు నమోదయ్యాయి. వీరిలో 808 మంది రోగులు రికవరీ అవ్వగా, 50 మంది మరణించారు.

గుజరాత్‌లో 2,624 కేసులు నమోదవ్వగా, వీరిలో 258 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 112 మంది మృతి చెందారు. 

click me!