కరోనా కలవరం.. మళ్లీ మూడు వేలు దాటిన కొత్త కేసులు.. ఆరు నెలల్లో ఇవే అత్యధికం..

By Asianet NewsFirst Published Apr 2, 2023, 12:17 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,824 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 18,389 చేరుకుంది. అయితే తాజాగా నమోదైన కేసులు గడిచిన ఆరు నెలల్లో అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ లో పేర్కొంది. 

కరోనా మళ్లీ కలవరానికి గురి చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కొంత కాలం వరకు తగ్గుముఖం పట్టిన కేసులు గత 15 రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా దేశ వ్యాప్తంగా 3,800 వేల కంటే ఎక్కువగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇవి గడిచిన ఆరు నెలల్లోనే అత్యధికమని పేర్కొంది. 

సీబీఐ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ

గడిచిన 24 గంటల్లో దేశంలో 3,824 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో భారతదేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. శనివారం 2,994 కేసులు వెలుగులోకి వచ్చాయి.  శుక్రవారం కూడా 3,095 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో అత్యధిక రోజువారీ సంఖ్య గురువారం నమోదైంది. ఆ రోజు 3,016 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,389 చేరుకుంది.

పరువు నష్టం కేసులో శిక్షను సవాలు చేసేందుకు సిద్దమైన రాహుల్ గాంధీ.. రేపే సూరత్ కోర్టులో పిటిషన్..!

కాగా.. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఢిల్లీ ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో శనివారం 416 కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చింది. ఇవి గడిచిన ఏడు నెలల్లో అత్యధికం. అక్కడ పాజిటివిటీ రేటు 14.37 శాతంగా ఉంది. కోవిడ్ వల్ల ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం ఈ మరణాల సంఖ్య 26,529కి చేరినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులెటిన్లో పేర్కొంది. దేశ రాజధానిలో కోవిడ్ కేసుల పెరుగుదలపై ఢిల్లీ ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచిందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు.

వివాహం జరిగిన 10 రోజులకే నవదంపతుల మృతి.. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..

అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ గత శనివారం 669 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 81,44,780 కు చేరుకుంది. మరణాల సంఖ్య 1,48,441 గా ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో 347 కేసులు నమోదు కాగా.. మహానగరంలో 189, పుణెలో 60 కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లో రికవరీల సంఖ్య 435 పెరిగి 79,93,015కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,324గా ఉంది.

click me!