Hit-And-Run: రోడ్డు దాటుతుండగా ఇద్దరు యువతులపైకి దూసుకెళ్లిన కారు.. పోలీసు అరెస్టు

By telugu teamFirst Published Oct 18, 2021, 3:31 PM IST
Highlights

పంజాబ్‌లో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు యువతలను ఢీకొట్టారు. దీంతో ఓ యువతి మరణించారు, తీవ్రంగా గాయపడ్డ మరొకరు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
 

చండీగడ్: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. Punjabలోని జలంధర్‌లో ఈ రోజు ఉదయం ఇద్దరు యువతులు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా Hit And Run ఘటన జరిగింది. వైట్ బ్రెజా కారు వారివైపు దూసుకెళ్లింది. ఇది గమనించిన వారిద్దరూ కారు వచ్చే దారి నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, అతివేగంగా వెళ్తున్న కారు క్షణాల్లోనే వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో యువతి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపింది ఓ పోలీసుగా గుర్తించారు. ఆ పోలీసును అరెస్టు చేశారు. 

ఈ ఘటనను సీసీటీవీ రికార్డు చేసింది. ఇద్దరు యువతులు రోడ్డు డివైడర్ దగ్గర నిలబడి ఉన్నారు. రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఓ Car తమవైపే వేగంగా దూసుకువస్తున్నట్టు వారిద్దరూ గమనించారు. వెంటనే అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే మించిపోయింది. ఇన్‌స్పెక్టర్ అమృత్ పాల్ సింగ్ నడుపుతున్న కారు వారి మీదకు దూసుకెళ్లింది. ఆ ఇద్దరు యువతులు నేలపై పడ్డారు. జలంధర్ కంటోన్మెంట్ ఏరియాలో ఈ రోజు ఉదయం 8.30 గంటల ప్రాంతలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ కారు షోరూమ్‌లో పని చేస్తున్న నవజోత్ కౌర్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Also Read: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

ఈ ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే స్థానికులు గుమిగూడారు. Jalandhar, పాగ్వారా హైవేపై నిరసన చేశారు. ట్రాఫిక్‌ను నిలిపేశారు. నిందితుడు అమృత్ పాల్ సింగ్‌పై వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన నగరంలో ట్రాఫిక్‌ను ప్రభావితం చేసింది.

‘ఈ రోజు ఉదయం నా బిడ్డ పని కోసం బయల్దేరింది. రైల్వే క్రాసింగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుండగా కారు ఢీకొట్టింది. ఆ ఎస్ఐపై మర్డర్ కేసు పెట్టాలి’ అని మృతిచెందిన నవజోత్ కౌర్ తల్లి తెజిందర్ కౌర్ డిమాండ్ చేశారు. 

click me!