కోర్టులోనే లాయర్‌పై తుపాకీతో కాల్పులు.. దారుణ హత్య

By telugu team  |  First Published Oct 18, 2021, 2:44 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ జిల్లా సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లో ఓ న్యాయవాదిని తుపాకీతో కాల్చి చంపారు. స్పాట్‌లో డెడ్ బాడీతోపాటు ఓ నాటు తుపాకీ కనిపించింది. నాలుగైదేళ్లుగా లా ప్రాక్టీస్ చేస్తున్న భూపేంద్ర సింగ్‌ను ఆయన టేకప్ చేసిన కేసులోని ప్రత్యర్థులే హతమార్చి ఉండే అవకాశముందనే అనుమానాలున్నాయి.
 


లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్‌లోనే ఓ Lawyerపై దుండగులు కాల్పులు జరిపి దారుణంగా హతమార్చారు. షాజహాన్‌పూర్ సివిల్ Courtలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్ మూడో ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగింది. మృతదేహం పక్కనే ఓ నాటు తుపాకీ లభించింది. సదర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని pistolని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ టీమ్ స్పాట్‌కు చేరుకుంది. మృతి చెందిన లాయర్‌ను భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. 

కోర్టులో విచారణ జరుగుతున్నది. కానీ, భూపేంద్ర సింగ్ తన కేసుకు సంబంధించిన పత్రాలను తిరగేస్తూ ఉన్నారు. మూడో అంతస్తులో ఆయన అప్పుడు ఒక్కడే ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. అంతే, సింగ్ కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకోగానే సింగ్ దగ్గర ఎవరూ లేరు. dead body పక్కనే నాటు తుపాకీ కనిపించింది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేవని షాజహాన్‌పూర్ ఎస్పీ ఎస్ ఆనంద్ తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు స్పాట్‌లోనే ఉన్నారు.

Latest Videos

undefined

అదే కోర్టులో ఉన్న ఓ న్యాయవాది మాట్లాడుతూ, ‘ఈ ఘటనకు సంబంధించిన సమాచారమేమీ ఇంకా తెలియదు. అప్పుడు మేం కోర్టులో ఉన్నాం. కొంతమంది మా దగ్గరకు పరుగెత్తుకు వచ్చి.. బయట ఒక వ్యక్తిని కాల్చి చంపినట్టు చెప్పారు. వెంటనే మేం చూడటానికి వెళ్లాం. అక్కడ న్యాయవాది విగతజీవిగా కనిపించాడు. ఆయన పక్కనే ఓ నాటు తుపాకీ ఉన్నది’ అని తెలిపారు. 

Also Read: న్యూఢిల్లీ కోర్టు ఆవరణలో కాల్పులు: గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి సహా నలుగురు మృతి

భూపేంద్ర సింగ్ అంతకు ముందు బ్యాంక్‌లో ఉద్యోగం చేశాడని తెలిసింది. గత నాలుగైదేళ్ల నుంచే న్యాయవాది వృత్తి ప్రాక్టీస్ చేస్తున్నట్టు సహచరులు వివరించారు. ఈ హత్య ఆయన వాదిస్తున్న కేసుతో ముడిపడి ఉండవచ్చని అనుమానాలున్నాయి. ఆయన టేకప్ చేసిన కేసులోని ప్రత్యర్థులు భూపేంద్ర సింగ్‌ను హతమార్చి ఉండవచ్చని అనుమానాలు వస్తున్నాయి.

ఫోరెన్సిక్ టీమ్ కొన్ని ఆధారలు సేకరించింది. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. న్యాయవాది హత్య దారుణమని, సిగ్గు చేటని ట్వీట్ చేశారు.

ఇటీవలే ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అది ఇంకా కోర్టు రూమ్‌లోనే జరిగిన ఘటన. ఇది కోర్టు కాంప్లెక్స్‌లో జరిగింది. సెప్టెంబర్ 24న కొందరు దుండగులు న్యాయవాదులు వేషంలో కోర్టు రూమ్‌లోకి అడుగుపెట్టి గ్యాంగ్‌స్టర్ జితెందర్ మాన్ అలియాస్ గోగిని హతమార్చిన ఘటన సంచలనాన్ని రేపింది.

click me!