కలుషిత రక్తం మార్పిడి.. 14 మంది చిన్నారులకు హెపటైటిస్ బీ,సీ, హెచ్ఐవీ పాజిటివ్..

By Asianet News  |  First Published Oct 24, 2023, 11:50 AM IST

కలుషిత రక్తం మార్పిడి చేయడం వల్ల 14 మంది పిల్లలకు పలు ఇన్ఫెక్షన్లు సోకాయి. ఇందులో హెపటైటిస్ బీ,సీ తో పాటు హెచ్ఐవీ వైరస్ కూడా ఉన్నాయి. వీరంతా తలసేమియాతో బాధపడుతూ రక్తమార్పిడి చేసుకున్న చిన్నారులు. బాధితులందరి వయస్సు 14 సంవత్సరాల్లోపే ఉంటుంది.


రక్తమార్పిడి చేయించుకున్న 14 మంది చిన్నారులకు హెపటైటిస్ బి, సి, హెచ్ ఐవీ వంటి ఇన్ఫెక్షన్లు సోకాయి. ఈ ఘటన కాన్పూర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. ఈ కలుషిత రక్తం ఎక్కించుకున్న చిన్నారులందరూ తలసేమియాతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు తలసేమియా కంటే ప్రమాదకరమైన వ్యాధితో వారందరూ బాధపడుతున్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని లాలా లజపతిరాయ్ (ఎల్ఎల్ఆర్) హాస్పిటల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హాస్పిటల్ లో దాతలు ఇచ్చిన రక్తంపై నిర్వహించిన పరీక్షల్లోనే లోపం ఉండవచ్చిన అధికారులు పేర్కొంటున్నారు. అయితే పిల్లలందరికీ ఆ వైరస్ లు ఎలా సోకాయని నిర్ధారించడం చాలా కష్టమని చెబుతున్నారు.

Latest Videos

దుర్గా పూజలో అపశ్రుతి.. మండపంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి..

ఇది ఆందోళన కలిగించే అంశమని, రక్తమార్పిడి వల్ల కలిగే ప్రమాదాలను ఈ ఘటన తెలియజేస్తోందని ఎల్ఎల్ఆర్ లోని పీడియాట్రిక్స్ విభాగాధిపతి, ఈ కేంద్రం నోడల్ అధికారి అరుణ్ ఆర్య అన్నారు. హెపటైటిస్ రోగులను గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి, హెచ్ఐవీ రోగులను కాన్పూర్ లోని రిఫరల్ కేంద్రానికి రిఫర్ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 180 మంది తలసేమియా రోగులకు రక్తమార్పిడి జరుగుతోందని తెలిపారు. 

కాగా.. ఈ 14 మంది చిన్నారులకు అత్యవసర సమయాల్లో పలు ప్రైవేటు, జిల్లా ఆసుపత్రుల్లో రక్తమార్పిడి చేశారు. తలసేమియా అంటే ఎర్ర రక్త కణాలలో ముఖ్యమైన భాగమైన హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా తయారు చేయనప్పుడు వచ్చే రుగ్మత. ఇది కొన్ని సార్లు వారసత్వంగా కూడా వస్తుంటుంది. దీనిని చికిత్స చేయడం ద్వారా నివారించుకోవచ్చు. 

విషాదం.. రిటైర్డ్ ఏసీపీ ప్రదీప్ టెంకర్ ఆత్మహత్య..

అయితే రక్తంలో వ్యాధి నిర్ధారణ కాకముందు ‘విండో పీరెయిడ్’ సమయంలో రక్తమార్పిడి జరిగిందని నోడల్ అధికారి అరుణ్ ఆర్య తెలిపారు. ఎందుకంటే పిల్లలు ఇప్పటికే తీవ్రమైన సమస్యతో పోరాడుతున్నారని, ఇప్పుడు ఓ దశలో ఉన్నారని చెప్పారు. రక్తమార్పిడి సమయంలో వైద్యులు పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించి ఉండాలన్నారు. 

180 మంది రోగుల్లో 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 14 మంది చిన్నారులకు ఇన్ఫెక్షన్లు సోకాయని ఆయన చెప్పారు. కరోనా సోకిన పిల్లల్లో ఏడుగురికి హెపటైటిస్ బీ, ఐదుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిందని తెలిపారు. ఈ చిన్నారలందరూ కాన్పూర్ సిటీ, దేహత్, ఫరూఖాబాద్, ఔరయ్య, ఎటావా, కన్నౌజ్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు. 

click me!