కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ టెస్టులో రన్నింగ్ చేస్తూ అభ్యర్థి మృతి

By Mahesh KFirst Published Mar 25, 2023, 3:58 PM IST
Highlights

ఒడిశాలో జరుగుతున్న కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఫిజికల్ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో 1600 మీటర్ల పరుగు పందెం పెట్టగా.. అందులో పాల్గొన్న ఓ 20 అభ్యర్థి మరణించాడు. 
 

భువనేశ్వర్: ఒడిశాలో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ జరుగుతున్నది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 1600 మీటర్ల రన్నింగ్ రేస్ నిర్వహించారు. ఈ రన్నింగ్ రేస్‌లో పాల్గొన్న 20 ఏళ్ల అభ్యర్థి మరణించాడు. ఈ ఘటన ఒడిశాలోని గాంజం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

మృతుడిని దీప్తి రంజన్ దాస్‌గా గుర్తించారు. గాంజం జిల్లా శ్యామసుందర్ పూర్ వాస్తవ్యుడని ఐడెంటిఫై చేశారు. 

ఛత్రపూర్‌లోని పోలీసు రిజర్వ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం ఫిజికల్ టెస్టు నిర్వహించారు. ఇక్కడ 1600 మీటర్ల రన్నింగ్ రేస్‌లో పాల్గొన్న దీప్తి రంజన్ దాస్ కుప్పకూలిపోయాడు. ఆయనను వెంటనే సబ్ డివిజినల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు తరలించే లోపు మరణించాడు. దీప్తి రంజన్ దాస్ హాస్పిటల్ తీసుకువచ్చే లోపే మరణించాడని వైద్యులు చెప్పినట్టు గాంజం ఎస్పీ జగ్‌మోహన్ మీనా తెలిపారు.

Also Read: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం: సీబీఐ ఎదుట విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్

1600 మీటర్ల రేస్ ప్రారంభించడానికి ముందు దాస్ ఆరోగ్యాన్ని వైద్యులు చెక్ చేశారని, ఫిజికల్ టెస్టుుకు ఆయన ఫిట్‌గా ఉన్నట్టే కనిపించారని వివరించారు. అయితే, ఆయన మరణానికి గల కచ్చితమైన కారణంగా పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని అన్నారు. ఈ ఘటన గురించి దాస్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.

click me!