స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఇలా జరగలేదు.. ఎన్నికల అధికారులను పీఎంవో ఆదేశించడమా?.. కాంగ్రెస్ ధ్వజం

By Mahesh K  |  First Published Dec 17, 2021, 8:36 PM IST

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. స్వతంత్ర భారతంలో ఎన్నికల అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం ఇది వరకు జరగలేదని విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలను నాశనం చేస్తుందని ఇది వరకు వచ్చిన ఆరోపణలు వాస్తవాలని చెప్పడానికి ఇదే నిదర్శనం అని పేర్కొంది.


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై Congress పార్టీ ధ్వజమెత్తింది. మోడీ ప్రభుత్వం(Modi Govt..) పాతాళానికి దిగజారిందని విమర్శలు చేసింది. ఎన్నికల అధికారులు(Election Official), పీఎంవో అధికారుల మధ్య సమావేశం విషయమై విరుచుకుపడింది. ఎన్నికల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం దాని చెప్పు చేతల్లో పెట్టుకుంటోందని మండిపడింది. దేశంలోని స్వతంత్ర సంస్థలను నాశనం చేయడంలో కేంద్ర ప్రభుత్వం బిజీగా ఉన్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శలు చేశారు. సంస్థలను నాశనం చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందని ఆరోపణలు చేశారు.

ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా ఓ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, ఇందులో ఎన్నికల కమిషనర్లు కూడా హాజరవ్వాలనే ఆదేశాలు వెలువడినట్టు పీటీఐ రిపోర్ట్‌లను పేర్కొంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అసలు రూపం బయట పడిందని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుసగుసలుగా వినిపించిన ఆ మాటలన్నీ ఈ వార్తతో నిజమై పోయాయని వివరించారు. స్వతంత్ర భారతంలో భారత ఎన్నికల సంఘాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశించడం ఇది వరకు వినబడ లేదని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో సంస్థలను నాశనం చేస్తున్న చరిత్రలో ఇది మరింత దిగజారుడు ఘటన అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్లను కేంద్ర ప్రభుత్వ విధేయులుగా మార్చుకోవాలనే ప్రయత్నాలు దారుణం అని ట్వీట్ చేశారు.

Latest Videos

undefined

Also Read: రాహుల్‌ను దున్నతో పోల్చిన కేంద్రమంత్రి.. ఆయనపై విమర్శల వెల్లువ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా ఎలక్టోరల్ రోల్‌పై ఓ సమావేశం నిర్వహిస్తున్నారని, అందులో చీఫ్ ఎన్నికల కమిషనర్ హాజరవ్వాలని ఆయన భావిస్తున్నారని ఓ రిపోర్టు పేర్కొంది. న్యాయ శాఖ ద్వారా ఈ ఆదేశాలు వెల్లినట్టు ఓ కథనం వచ్చింది. ఈ కథనం రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించింది. ఇది వరకే కేంద్ర ప్రభుత్వం పలు స్వతంత్ర సంస్థలను ధ్వంసం చేసిందని ఇది వరకే పలుసార్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ఎంపీ rahul gandhi పార్లమెంటులో మాట్లాడుతూ.. అజయ్ మిశ్రాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఆయనో క్రిమినల్’ అని, వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘లఖింపుర్ ఖేరీ’ ఘటన ఓ కుట్ర అని తేలింది. ఈ ఘటనకు ఎవరి కుమారుడు బాధ్యుడో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ మంత్రి (అజయ్ మిశ్ర) resignation చేయాలని కోరుతున్నాను. దీని మీద పార్లమెంటులో చర్చ జరగాలి. కానీ, ప్రధాని అందుకు అంగీకరించట్లేదు. రైతుల హత్యకు కారణమైన ఆ మంత్రి ఓ క్రిమినల్, ఆయన రాజీనామా చేయాలి. ఆయనను కఠినంగా శిక్షించాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు. 

లఖింపూర్ ఖేరిలో రైతు ఆందోళనకారులపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఇందులో నలుగురు రైతులు ఉన్నారు. అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా కారు రైతు ఆందోళనకారులపై వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 

click me!