"ఈ కుట్ర కూడా ప్రజాస్వామ్య విధ్వంసంలో భాగమే.." : కాంగ్రెస్ చీఫ్

Published : Aug 24, 2023, 07:56 PM IST
"ఈ కుట్ర కూడా ప్రజాస్వామ్య విధ్వంసంలో భాగమే.." : కాంగ్రెస్ చీఫ్

సారాంశం

ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే విమర్శల వర్షాన్ని కురిపించారు. 

ఎన్నికల సమీపిస్తున్న కొద్ది దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష మాటల యుద్ధం మొదలైంది. ఈ తరుణంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే విమర్శలు గుప్పించారు.

ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో భాగంగా  మోదీ సర్కార్ సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఈ తరుణంలో RTI వెబ్‌సైట్ నుండి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు  అదృశ్యమైనట్లు  ఆరోపణలపై స్పందించారు. దరఖాస్తుల తొలగింపు అనేది పైకి కనిపిస్తున్న ఘటన మాత్రమేనని, అంతర్గతంగా సమాచార చట్ట విధ్వంసం జరుగుతుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని కొంచం చంపేస్తోందని,  ఇది రాజ్యాంగ హక్కులపై (ప్రజల) దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో మరో అడుగని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  

సమాచార రక్షణ చట్టం ముసుగులో సమాచార హక్కు చట్టం ప్రతిపాదిత సవరణ,  సమాచార హక్కుపై నిరంకుశ ప్రభుత్వం చేస్తున్న పిరికి దాడి అని కూడా ఆయన ఆరోపించారు.

Also Read: Chandrayaan-3: ఆ వైఫల్యమే చంద్రయాన్ 3 విజయానికి కారణం: నంబి నారాయన్

ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను పలుచన చేసిందని పలు ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంఘాలు ఆరోపించాయి. ఈ అభియోగాన్ని మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది మోదీ ప్రభుత్వం పారదర్శకత గురించి పట్టించుకోని సిగ్గుమాలిన పని అని ఖర్గే ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు