కూతురిని వేధించిన ప్రియుడు..  ప్రైవేట్ పార్ట్ లను కోసివేసిన తల్లి..    

Published : Aug 24, 2023, 07:48 PM IST
కూతురిని వేధించిన ప్రియుడు..  ప్రైవేట్ పార్ట్ లను కోసివేసిన తల్లి..    

సారాంశం

తన కుమార్తెపై కన్నేసిన తన ప్రియుడ్ని ఓ వివాహిత అత్యంత దారుణంగా వ్యవహరించింది. కోపోద్రిక్తురాలైన ఆ తల్లి తన కుమార్తెతో కలిసి ఆ ఉన్మాదిని అత్యంత దారుణంగా ప్రైవేట్ పార్టులను కోసి.. హత్యమొందించింది.  హత్య చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని అడవిలో పడేశారు ఆ తల్లికూతుళ్లు.

దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్నో కఠిన తరమైన చట్టాలను రూపొందించి అమలు చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. కామాంధులు ఆ చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా మృగాల రెచ్చిపోతున్నారు.  తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.  తన కుమార్తెపై కన్నేసిన ప్రియుడ్ని అత్యంత దారుణంగా హతమొందించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో 45 ఏళ్ల మహిళ 60 ఏళ్ల  మెహందీ లాల్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి మధ్య సంబంధం చాలా ఏండ్లుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆవృద్ధ కామాంధుడి కన్ను ఆమె 19 ఏళ్ల కుమార్తెపై పడింది. ఆ బాలికను ఆ కామాంధుడు పలుమార్లు వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లి కోపోద్రిక్తురాలు అయ్యింది. 

ఈ క్రమంలో పథకం ప్రకారం.. మెహందీ లాల్‌ను ఆ మహిళ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడికి విపరీతంగా మద్యం తాగింది. మద్యం మత్తులో స్పృహ కోల్పోవడంతో ఆ మహిళ తన కుమార్తెతో కలిసి వృద్ధుడిని జననాంగాలు కోసి హత్య చేసింది. ఆ తరువాత ఆ శవాన్ని సమీపంలోని అడవిలో పడేసింది. తన తండ్రి అడవిలో శవమై కనిపించినట్లు మెహందీలాల్ కుమారుడు సుశీల్ కుమార్ ఆగస్టు 21న పోలీసులకు సమాచారం అందించినట్లు రాయ్ బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు.

ఫోరెన్సిక్ బృందంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మెహందీ లాల్ శరీరంపై గాయాల గుర్తులు, అతని ప్రైవేట్ పార్ట్‌లు కోసుకున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నా.. పోలీసులు బుధవారం నిందిత మహిళ, ఆమె కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి విచారణ ప్రారంభించారు. వృద్ధుల మరణానికి కారణం పక్కటెముకలు విరిగిపోవడం, గొంతు నులిమి చంపడం వల్ల ఊపిరాడకపోవడమే. నిందితుడు మహిళతో మెహందీలాల్ గత కొన్నేళ్లుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. తాజాగా ఆమె కూతురిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

ఆగస్టు 20న మెహందీ లాల్ మళ్లీ ఆ మహిళ కూతురిపై బలవంతం చేశాడు. అనంతరం జరిగిన విషయాన్ని కూతురు తల్లికి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన తల్లి తన కుమార్తె సహాయంతో మెహందీలాల్‌ను హత్య చేసి మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో పడేసింది. విచారణలో మహిళ తన నేరాన్ని అంగీకరించింది.
 

PREV
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu