INDIA Bloc: నితీశ్ కుమార్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కామెంట్స్

By Mahesh K  |  First Published Jan 29, 2024, 2:22 AM IST

నితీశ్ కుమార్ కాంగ్రెస్ కూటమి నుంచి బీజేపీ కూటమిలో చేరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. నితీశ్ కుమార్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. బీజేపీ, జేడీయూ కలిసే ఇండియా కూటమిని ముక్కలు చేయాలని కుట్ర పన్నాయని ఆరోపించారు.
 


Mallikarjun Kharge: బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలోకి జేడీయూ చేరిపోయింది. నితీశ్ కుమార్ సీఎంగా రాజీనామా చేశారు. ఉదయం కాంగ్రెస్ కూటమి సీఎంగా ఉన్న నితీశ్ కుమార్, సాయంత్రానికి బీజేపీ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

నితీశ్ కుమార్ నిర్ణయం బిహార్ రాజకీయాలను కుదిపేసింది. అంతేకాదు, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఇండియా బ్లాక్ కూటమి కోసం నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ కూటమి సీట్ల పంపకాల వరకు చేరుకుంది. ఇంతలోనే నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చాడు. దీంతో బిహార్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతోపాటు మొత్తం విపక్ష పార్టీలతో ఏర్పాటైన ఇండియా కూటమి ఉనికికే దెబ్బ పడింది. ఈ నేపథ్యంలోనే నితీశ్ కుమార్ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు.

Latest Videos

Also Read: YSRCP: వైసీపీ ఐదో జాబితాపై తీవ్ర కసరత్తు.. మరో రెండు రోజుల్లో జాబితా ప్రకటన!

ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. ‘అలాంటి నిర్ణయాలు ఇప్పటికిప్పుడే తీసుకోలేం. కచ్చితంగా ముందస్తు ప్రణాళిక ఉంటుంది. ఇండియా కూటమిని ముక్కలు చేయడానికి బీజేపీ, జేడీయూలు కలిసే కుట్ర చేశాయి. నితీశ్ కుమార్ మాకు ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. లాలు యాదవ్‌కు కూడా తెలియకుండా చేశాడు’ అని ఖర్గే అన్నారు. నితీశ్ కుమార్ ఎన్డీయేలోకి వెళ్లడం ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు.

click me!