బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరిలు ప్రమాణం చేశారు.
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మొత్తంగా జేడీయూ , బీజేపీల నుంచి ముగ్గురు, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌లు కొత్త ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ , ఎల్జేపీ ఇతర పక్షాల మద్ధతుతో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది తొమ్మిదోసారి.
- Nitish Kumar takes oath as Bihar CM for the 9th time after he along with his party leaders joined the BJP-led NDA bloc. pic.twitter.com/Vzy96PfZzI
— TIMES NOW (@TimesNow)
కాగా.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆదివారం ఉదయం గవర్నర్ రాజేంద్ర వి ఆర్లేకర్ ను రాజ్ భవన్ లో కలిశారు. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని గవర్నర్ వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. ఆయన వెంట జేడీయూకు చెందిన సీనియర్ మంత్రి బిజేంద్ర యాదవ్ కూడా రాజ్ భవన్ కు వెళ్లారు.
నితీష్ కుమార్ తన అధికారిక నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో నేటి ఉదయం సమావేశం అయ్యారు. బీహార్ లోని మహాకూటమిని వీడి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆయన నిర్ణయానికి పార్టీ ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. అనంతరం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పించారు. సాయంత్రం 5 గంటల సమయంలో బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.
ఇకపోతే.. బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 243 . ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి 75 మంది , బీజేపీకి 74, జేడీయూకు 43 మంది ఎమ్మెల్యేల బలం వుంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి వుండటంతో జేడీయూ ఒకసారి బీజేపీ మద్ధతుతో తర్వాత ఆర్జేడీ సపోర్ట్‌తో అధికారాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర, దేశ స్థాయిలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. సీఎం పదవి తన చేజారిపోకుండా వ్యూహాలు రచిస్తూ చాణుక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం నితీష్ కుమార్.
ఇప్పుడు తాజాగా బీజేపీ ఎమ్మెల్యేల మద్ధతుతో నితీష్ కుమార్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్జేడీ మంత్రుల స్థానంలో ఇప్పుడు బీజేపీ శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా ఎనిమిది మంది సభ్యుల బలం కావాలి.. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రస్తుతం ఈ కూటమికి 114 మంది ఎమ్మెల్యేల బలం వుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. అంతేకాదు.. బీజేపీ, జేడీయూలకు చెందిన 10 మందిని ఈ పక్కకి లాగేందుకు లాలూ పావులు కదుపుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీలో పార్టీల వారీగా బలాబలాలు చూస్తే : ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 74, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 మొత్తం 125 మంది సభ్యుల బలం వుంది. ఇక మహాఘట్‌బంధన్ కూటమిని చూస్తే.. ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, సీపీఐ ఎంఎల్ 12, సీపీఐ 2, సీపీఎం 2 మొత్తం 110 సభ్యుల బలం వుంది. వీరు కాక ఎంఐఎం 5, బీఎస్పీ 1, ఎల్జేపీ 1, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మొత్తం 8 మంది ఇతరులు వున్నారు.