ఢిల్లీ హై-సెక్యూరిటీ జోన్‌లో షాకింగ్ ఘటన.. మహిళ ఎంపీ మెడలోని బంగారు గొలుసు చోరీ..

Published : Aug 04, 2025, 02:13 PM IST
MP Sudha Ramakrishnan

సారాంశం

MP Sudha Ramakrishnan chain snatching: ఢిల్లీలోని చాణక్యపురిలో కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్‌పై దొంగలు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతితో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

MP Sudha Ramakrishnan chain snatching: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఓ మహిళ ఏంపీని దుండగులు టార్గెట్ చేశారు. మార్నింగ్ వాకింగ్‌ చేస్తున్న ఆమెపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసి,  ఆ మెడలో ఉన్న నాలుగు  తులాల బంగారు చైన్ లాక్కెళ్లాడు. సాధారణ మహిళల మెడల్లోంచి గొలుసులు ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం గానీ, ఏకంగా ఓ మహిళ ఎంపీ మెడలోంచే చైన్ లాక్కెళ్లడం షాక్ కు గురి చేస్తుంది. అది కూడా ఢిల్లీలోని హై-సెక్యూరిటీ డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్ అయిన చాణక్యపురిలో ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మహిళ రక్షణ, భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకెళ్తే..

కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం ఢిల్లీలోని చాణక్యపురిలోని పోలాండ్ ఎంబసీ ప్రాంతంలో డిఎంకె ఎంపీ రాజతితో కలిసి వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆమె నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ దాడి ఆమె గాయపడింది. అయితే.. ఢిల్లీలోని హై-సెక్యూరిటీ డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్ అయిన చాణక్యపురిలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ఈ దొంగతనం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ

ఈ సంఘటనపై కాంగ్రెస్ ఎంపీ, బాధితురాలు సుధా రామకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చూస్తూ.. " సోమవారం ఉదయం 6.15 - 6.20 గంటల ప్రాంతంలో మేము పోలాండ్ ఎంబసీ గేట్-3, గేట్-4 మధ్య భాగంలో వాక్నింగ్ చేస్తున్నాం. ఈ సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి, ముఖాన్ని పూర్తిగా కప్పుకుని స్కూటర్‌పై వేగంగా వచ్చారు. చూస్తుండగానే నా మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. " అని పేర్కొన్నారు.

"మాకు వ్యతిరేకంగా వ్యక్తి చైన్ స్నాచర్ అయి ఉంటాడని నేను అనుమానించలేదు. ఆ దుండగుడు నా మెడ నుండి గొలుసును లాగడంతో మెడపై గాయాలయ్యాయి. నా డ్రెస్ కూడా చిరిగిపోయింది. మేమిద్దరం సహాయం కోసం అరిచాము. రాయబార కార్యాలయాలు, రక్షిత సంస్థలు ఉన్న చాణక్యపురి వంటి హై సెక్యూరిటీ జోన్‌లో ఓ మహిళ ఎంపీ పై బహిరంగ దాడి జరగడం దిగ్భ్రాంతికరం’ అని ఆవేదన వ్యక్తం చేసింది

మహిళ ఎంపీ ఆ లేఖ ఇంకా " ఈ ఆకస్మిక దాడిలో నా మెడపై గాయం అయింది, 4 తులాల నా బంగారు గొలుసు పోగొట్టుకున్నాను, ఈ దాడితో నేను చాలా బాధపడ్డాను. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. నాకు త్వరగా న్యాయం జరిగేలా చూడండి. నేరస్థుడిని సతర్వమే పట్టుకునేలా" సంబంధిత అధికారులను ఆదేశించాలని ఏంపీ సుధా రామకృష్ణన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను అభ్యర్థించారు.

భారతదేశ రాజధానిలోని ఈ అధిక ప్రాధాన్యత గల జోన్‌లో ఒక మహిళ సురక్షితంగా నడవలేకపోతే, సాధారణ ప్రాంతాల్లో ఇతరులు ఎలా జీవించగలరు. వారు ఎక్కడ సురక్షితంగా ఉండగలం" అని ఆమె చాణక్యపురి ఘటనను ప్రస్తావిస్తూ అన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల అనేక రాయబార కార్యాలయాలు, అధికారిక నివాసాలు ఉన్నాయి.

తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కీలక నాయకురాలైన న్యాయవాది సుధా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మైలదుత్తురై నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన అనంతరం, నియోజకవర్గ అభివృద్ధిపై లోక్‌సభలో ఎన్నో కీలకమైన అంశాలు లేవనెత్తుతూ ఆకర్షణీయంగా నిలిచారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ సుధా ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో బస చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, నిందితుడి కోసం విచారణను ముమ్మరం చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?