Shibu Soren: నింగికెగసిన ఉద్యమ కెరటం.. 'దిశోం గురూజీ' శిబు సోరెన్ కన్నుమూత..

Published : Aug 04, 2025, 12:52 PM IST
Shibu Soren

సారాంశం

Shibu Soren passes away: జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ 81 సంవత్సరాల వయసులో మరణించారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన జీవిత, రాజకీయ ప్రస్థానం వివరాలు. 

Shibu Soren passes away: జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ 81 సంవత్సరాల వయసులో మరణించారు. సోమవారం నాడు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గత నెలన్నరగా చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాల సమస్యల కారణంగా జూన్ చివరి వారంలో శిబు సోరెన్ ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన తండ్రి శిబు సోరెన్ మరణ వార్తను ఎక్స్ లో తెలియజేశారు. 

 

 

శిబు సోరెన్ భౌతికకాయం సోమవారం సాయంత్రం రాంచీకి చేరుకుంటుందని, రేపు అసెంబ్లీలో దర్శనార్థం ఉంచుతామని, రేపు సాయంత్రం రామ్‌గఢ్‌లోని నెమ్రాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శిబు సోరెన్ పూర్వీకుల గ్రామం, జన్మస్థలం రామ్‌గఢ్‌ కావడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జూన్ చివరి వారంలో కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా శిబు సోరెన్ ఆసుపత్రిలో చేరారు. నెలన్నర క్రితం స్ట్రోక్ కూడా వచ్చింది. ఆయన గత నెల రోజులుగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నారు. శిబు సోరెన్ ఈరోజు ఉదయం 8:56 గంటలకు మరణించినట్లు సర్ గంగా రామ్ ఆసుపత్రి తెలిపింది.

ప్రముఖుల సంతాపం

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన తండ్రి శిబు సోరెన్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, " “గౌరవనీయులైన దిశోం గురూజీ మనందరినీ విడిచిపెట్టారు. ఈ రోజు నేను శూన్యంలో ఉన్నాను. శిబు సోరెన్ జార్ఖండ్‌లోనే కాకుండా మొత్తం దేశంలో సామాజిక న్యాయం కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేశారు. ఆయనను ఎల్లప్పుడూ మిస్ అవుతారు" అంటూ పేర్కొన్నారు.

 

రాజకీయ ప్రస్థానం

 

అదే కీలక మలుపు

శిబు సోరెన్ 1944 జనవరి 11న రామ్‌గఢ్‌లోని నెమ్రా గ్రామంలో జన్మించారు. గిరిజనులలో దిషోం గురువు అనే ఇమేజ్‌ను సృష్టించిన శిబు సోరెన్ తండ్రి సోబరన్ మాంఝీని వడ్డీ వ్యాపారులు హత్య అయ్యారు. ఈ పరిణామం అనంతరం కేవలం 13 వయస్సు నుంచే గిరిజనులు, స్థానిక ప్రజలు, దళితులు, వెనుకబడిన తరగతుల హక్కుల కోసం వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 1960లలో ఆయన గిరిజన హక్కుల కోసం, నీరు-అటవీ-భూమి రక్షణ కోసం పోరాటం ప్రారంభించారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపన

శిబు సోరెన్ 1970లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)ను స్థాపించారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో గిరిజనుల భూమిహక్కులు, వారిపై జరుగుతున్న దోపిడీ , అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన తన గొంతు విప్పారు. నీరు, అడవి, భూమి కోసం, ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం 40 సంవత్సరాలు పోరాడారు. ఉద్యమ సమయంలో ఆయన ఎక్కువ సమయం అడవులు, పర్వతాలలో గడిపాడు. ఈ సమయంలో ఆయన హత్యతో సహా అనేక తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఆరోపణాలు ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్ళాడు. ఆయన కృషి, సుదీర్ఘ పోరాటం ఫలితంగా 2000 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది.

 

తొలి ఎన్నికల్లోనే ఓటమి

శింబు సోరన్ 1977లో తుండి అసెంబ్లీ నుండి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటి ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీని తరువాత శిబు సోరెన్ సంతల్ పరగణా దుమ్కా లోక్‌సభను తన రాజకీయ కర్మభూమిగా చేసుకున్నారు. 1980లో ఇక్కడి నుండి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన పృథ్వీచంద్ కిస్కును ఓడించి మొదటిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ విజయం తరువాత ఆయన ఎన్నడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన అనేకసార్లు పార్లమెంటులో గిరిజన సమస్యలను లేవనెత్తారు.

 

మూడు సార్లు ముఖ్యమంత్రిగా..

జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు చురుకైన పాత్ర పోషించారు శింబు సోరన్ . ఆయన కృషి, సుదీర్ఘ పోరాటం ఫలితంగా 2000 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శిబు సోరెన్ జార్ఖండ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు - 2005, 2008,2009లో. అయితే, రాజకీయ అస్థిరత, సంకీర్ణ రాజకీయాల కారణంగా ఆయన పదవీకాలం ఎక్కువ కాలం కొనసాగలేదు. అయినప్పటికీ, గిరిజన సంక్షేమం, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు.

పదవులు

దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో దివంగత శిబు సోరెన్ రెండుసార్లు బొగ్గు మంత్రిగా పనిచేశారు. అలాగే ఆయన మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిది సార్లు దుమ్కా పార్లమెంటరీ స్థానం నుండి ఎంపీగా ఉండటమే కాకుండా, జామా అసెంబ్లీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

ఒడిదుడుకులు

ఆయన రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. అవినీతి, హత్య వంటి తీవ్రమైన కేసుల్లో శిబు సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి, అయితే తరువాత అనేక కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. 1995లో శిబు సోరెన్‌ను JAC అధ్యక్షుడిగా నియమించారు. ఇది ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి అడుగు. ఈ కారణంగానే శిబు సోరెన్ జార్ఖండ్‌లోనే కాకుండా మొత్తం దేశంలో ఒక ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?