పాదయాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర, ముహూర్తం ఎప్పుడంటే..?

Siva Kodati |  
Published : Jul 14, 2022, 05:12 PM ISTUpdated : Jul 14, 2022, 05:21 PM IST
పాదయాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర, ముహూర్తం ఎప్పుడంటే..?

సారాంశం

అక్టోబర్ 2 నుంచి ‘‘భారత్ జోడో’’ పేరిట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. 

దేశవ్యాప్తంగా బీజేపీ (Bjp) బలపడుతుండటం.. కాంగ్రెస్ (congress) ప్రభ మసకబారుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2 నుంచి ‘‘భారత్ జోడో’’ (Bharat Jodo padayatra) పేరిట సుదీర్ఘ పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. 148 రోజుల పాటు 12 రాష్ట్రాల్లోని 203 నియోజకవర్గాల గుండా  రాహుల్ పాదయాత్ర సాగనుంది. మొత్తం 3,600 కిలోమీటర్ల మీర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ప్రారంభమై.. కాశ్మీర్‌లో ముగియనుంది. 

కాగా.. రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన యూరప్‌‌కు వెళ్లారని.. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సమాచారం. అయితే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన తిరిగి స్వదేశానికి చేరుకుంటారని చెబుతున్నారు. ఆదివారం ఆయన ఇండియాకు చేరుకనే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఆయన నాయకత్వ నిబద్దతపై అనే ప్రశ్నలకు తావిస్తోంది. 

ALso REad:విదేశీ పర్యటనకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ కీలక సమావేశానికి దూరం..!

గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒక చోట కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు సందర్భాల్లో రాహుల్ విదేశీ పర్యటనలు చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా గోవా కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న వేళ.. రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.  

ఇక, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత.. అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ రాజీనామాతో సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మరోసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ ఏడాది మే నెలలో.. రాహుల్ గాంధీ నేపాల్‌ రాజధాని ఖాట్మండులోని నైట్‌క్లబ్‌లో ఉన్న ఫొటోలను విడుదల చేసిన బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. అయితే ఫ్రెండ్ పెళ్లి కోసం రాహుల్ నేపాల్‌కు వెళ్లారని.. అందులో ఎలాంటి తప్పు లేదని కాంగ్రెస్ పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood